పుట:Naajeevitayatrat021599mbp.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిన పిలుపును మన్నించి ఒకటి రెండుసార్లు కార్యనిర్వాహక సభకు హాజరయ్యాను. ఏ గ్రామంలో జరిగినా ఆఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగుల కన్నింటికీ హాజ రయ్యాను. కాని మంత్రిగా నున్న రోజులలో ఏ మీటింగ్‌లోనూ నోరు విప్పి ఏ విధమయిన ఉపన్యాసమూ ఇవ్వలేదు. పూనా మీటింగులో కూడా నేను మాటలాడలేదు.

కాని బొంబాయిలో నోరు విప్పక తప్పలేదు. గాంధీగారి పక్షాన నిలిచిన అయిదుగురికీ, వారికి వ్యతిరేకంగా అహింసాత్మక విధానానికి స్వస్తి చెప్పాలని తలచిన ఆ పదిమందికీ మధ్య ఉన్న అభిప్రాయభేదాలు అసలెల్లా ఉత్పన్నమయ్యాయో గ్రహించాలని నిర్ణయించుకున్నాను. అందువల్లనే ఆ బొంబాయి మీటింగులో నోరు విప్పవలసి వచ్చింది.

అహింసా విధానానికి రాజాజీ వ్యతిరిక్తత

పూనా మీటింగులోనూ అంతకు పూర్వమూ కూడా గాంధీగారు తమంతట తామే విరమించు కున్నారని తలచాను. కాని తరవాత నాకు గ్రాహ్యమైందేమిటంటే - ఆయన తన శక్తివంచన లేకుండా రాజగోపాలాచారి ప్రభృతులను కాంగ్రెసుకు గడచిన ఇరవై సంవత్సరాలుగా పట్టుగొమ్మగా ఉంటూన్న అహింసావిధానాన్ని ఆహుతి చేయవద్దని కోరారనీ, అలాంటి క్లిష్టపరిస్థితులలో ఉద్యోగాది హోదాలమీద మమకారాలు పెట్టుకోవడం న్యాయం కాదనీ, బ్రిటిషువారు తమకు హోదా లిచ్చినా చేతులు కట్టీ, మూతులు బిగించి మరీ ఇస్తారనీ, ఎటొచ్చీ వారు జారీ చేసే ఆర్డరును కంటితో చూసి చేతితో సంతకం చెయ్యగల హక్కే తమకు మిగులుతుందని వివరంగా చెప్పారనీ, ఇంత స్పష్టంగా పరిస్థితులు లెలా ఉండగలవో ఆలోచించి చెప్పినా, ఆ పదిమంది కార్యనిర్వాహకవర్గీయులు తాము గాంధీగారి కంటె తెలివయినవారమనే తలచరాని. పూనాలో గాంధీగారు తనకు తానుగా విరమించు కోలేదనీ, తనపై తన అహింసాత్మక విధానానికి వ్యతిరేకంగా విశ్వాసరాహిత్య