పుట:Naajeevitayatrat021599mbp.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటనీ, బ్రిటిషువారు ఆ తీర్మానంలో ఇమిడిఉన్న ప్రతిపాదనలకు ఒప్పుకోరనీ, కొద్దివారాలలో కాంగ్రెసువారు ముఖాలు వేల వేసుకుని గాంధీగారి కాళ్ళమీద పడి, "నీవే మాకు శరణ్యం, నీవే దారి చూపాలి" అని వేడుకుంటారనీ, మళ్ళీ ఏ ప్రత్యక్ష్యచర్యకో పూనుకుంటేనేగాని బ్రిటిషువారు లొంగరనీ నేను అన్నాను.

నేను అనుకున్న ప్రకారమే వైస్రాయ్ పూనా తీర్మానాన్ని తిరస్కరించడమూ, కాంగ్రెసు హైకండ్‌వారు, "మీరే మాకు శరణ్యం, మీరే మాకు ఏకైక నాయకులు, మీరు కలుగజేసుకుని బాధ్యత వహించి దేశరక్షణమార్గం ఆలోచించాలి" అని కోరారు. నెల తిరక్కుండా పూనా తీర్మానం రద్దయి, బొంబాయి తీర్మానం అంగీకరించబడింది, అహింసాత్మక విధానమే శరణ్యం, మహాత్మా గాంధీయే మాకు ఏకైక నాయకుడు, ఆయనే తిరిగి దారి చూపించాలి అనే భావన అందులో ఉంది.

గాంధీజీ తాను చేయదలచిన పని నిర్దుష్టంగా అఖిల భారత కాంగ్రెసు కమిటీవారితో చెప్పేశాడు. యుద్దం దినాలలో తాను శాసన ధిక్కార మనేది పెద్ద ఎత్తున ప్రజ లందరూ ఒక్కకుమ్మడిని చేయడానికి ఒప్పుకోననీ, వ్యక్తి సత్యాగ్రహాన్ని మాత్రమే ప్రోత్సాహిస్తాననీ, యుద్ధ సమయంలో అనుచితంగా జారీ చేయబడిన ఆర్డినెన్స్‌ద్వారా స్వేచ్ఛగా మాటలాడే హక్కు కూడా మానవులకు లేకుండా చేయబడిన కారణంగా ఈ ఆర్డినెన్స్‌ను ధిక్కరిస్తూ వ్యక్తి సత్యాగ్రహం చేయవచ్చుననీ ఆయన సూచించాడు.

ఆరంభంలో ఎవ్వరూ ఈ వ్యక్తి సత్యాగ్రహ మన్నది అంత బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని తలచలేదు. నేను అఖిల భారత కాంగ్రెసు కమిటీవారికీ, మహాత్మునికీ కూడా, ప్రజానీకం మీ ఆజ్ఞకు ఎప్పుడూ బద్దులేనని చెప్పిఉన్నాను. ఆ బొంబాయి తీర్మానాన్ని పురస్కరించుకుని వ్యక్తి సత్యాగ్రహం 1940 నవంబరులో ఆరంభ మయింది. ఈ దెబ్బతో మంత్రులుగానూ, శాసన సభా సభ్యులుగానూ,