పుట:Naajeevitayatrat021599mbp.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదో ప్రకారంగా కొంత ధనాన్ని 'స్వరాజ్య' కంపెనీవారి కిచ్చి, మొత్తం తనకు రావలసి ఉంటుందనుకున్న డబ్బుకు హామీగా ఆ అచ్చాఫీసునంతటినీ వ్రాయించుకోవాలని ఆయనకు ఆశ పుట్టింది.

నా భార్య, ఆ 'స్వరాజ్య' కంపెనీకి ఆమె స్వంతం ఒక లక్షా పదమూడు వేల రూపాయలు అప్పు ఇచ్చి, ఆ కంపెనీ ఆస్తులపై ఫ్లోటింగ్ హక్కు పత్రం వ్రాయించుకుంది. ఇంటి యజమాని, తాను పొందిన సలహా ప్రకారం, ఆమెకున్న యావత్తు హక్కూ ఆయన పరంగా ఆమె వదులుకుంటే తప్ప ఒక్క కాణీకూడా అప్పు ఇవ్వనని స్పష్టంగా చెప్పేశాడు.

అప్పటికి నా భార్య హనుమాయమ్మ, ఇచ్చిన అప్పు వడ్డీతో సహా రెండులక్షల వరకూ పెరిగింది. ఆ ఇంటి యజమాని, తాను కోరిన ప్రకారం హనుమాయమ్మ ఆమెకున్న యావత్తు హక్కూ తనపరం గావించిన తరవాత 'స్వరాజ్య' కంపెనీవారు ఆ కంపెనీకున్న యావత్తు ఆస్తీ తన పేర తనఖా వ్రాయాలనికూడా షరతు పెట్టాడు.

కృపానిధి అప్పు కావాలని వ్రాసిన ఉత్తరానికి జవాబుగా సూర్యనారాయణరావు, ముందుగా హనుమాయమ్మగారి కున్న హక్కులన్నీ తన పేర ట్రాన్సఫర్ అయితే తప్ప, అప్పు ఇవ్వబడదని స్పష్టంచేశాడు. హనుమాయమ్మ పట్నంలోనే ఉంటూ ఉన్నా, స్వతస్సిద్దంగా ఏమీ చదువుకున్న ఇల్లాలు కాదు. ఆమె నేను ఏది చెపితే అది తు. చ. తప్పకుండా చేసే బాపతు మనిషి.

అందువల్ల కృపానిధీ, సూర్యనారాయణరావు కలిసి వెల్లూరు జెయిల్లో నన్ను కలుసుకోడానికి వచ్చారు. నా భార్యకున్న హక్కులన్నీ సూర్యనారాయణగారి పేర ట్రాన్స్‌ఫర్ కావడానికి కావలసిన సన్నాహమంతా ఆమె చేసేలాగున నాచేత ఉత్తరం వ్రాయించుకోవాలని నా వద్దకు వచ్చారు. వారు వెల్లూరు ఒక శనివారం నాటికి జేరుకున్నారు. ఆ రావడంకూడా సాధారణంగా జెయిలు రూల్స్ ప్రకారం ఇవ్వబడే ఇంటర్వూకాలం పూర్తి అయ్యాక వచ్చారు.

వా రిరువురూ మేజరు ఖాన్ ఇంటికి వెళ్ళి తాము ఆనాడు సకా