పుట:Naajeevitayatrat021599mbp.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాట్ల విషయంలోను పైవారి ప్రమేయం లవవేశమూ లేకుండా చూసుకుని, మాంచి రసకందాయ పట్టుతో నిగ్రహించుకు రాగలగడం. ఈ కారణాలవల్ల అపజయం అన్నది దరికి రాకుండా పోయింది.

12

1932 లో నా అరెస్టు

1932లో నన్నూ, నాతోడి వర్కర్లనూ నిర్భధించడానికి కారణంగా, మేము పన్నుల నిరాకరణ ఉద్యమం సాగింపబోతున్నామని చెప్పబడింది. నిజానికి అలాంటి ప్రయత్నం ఏదీ మేము చేయదలచి ఉండలేదు. అయినా రెండవ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ నుంచి తిరిగి వచ్చి గాంధీగారు భారతదేశంలో అడుగు పెట్టేనాటికి అన్ని రాష్ట్రాలలోని అగ్రనాయకులనూ నిర్భంధించి తీరాలనే ప్రభుత్వపుటెత్తే రకరకాల కారణాలను సృష్టించి, దేశవ్యాప్తంగా అగ్రనాయకు లన్నవారి కందరినీ అరెస్టుచేసి, కటకటాలు వెనక్కి పంపించింది.

అప్పట్లో లండన్‌లోని పత్రికలలోనూ, భారత దేశమందలి ముఖ్య పత్రికలలోనూ కొన్ని వార్తలు పడ్డాయి. రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్స్‌లో సర్ శామ్యూల్ హోర్ (Sir Samuel Hoare) ప్రతిపాదనలను గాంధీగారు అంగీకరించని కారణంగా, ఆయన్ని అవమాన పరచడమూ, చిన్న బుచ్చడమూ సాగించిన పెద్దలు 'వెళ్ళవయ్యా వెళ్ళు, ఎల్లా వచ్చావో అల్లాగే వెళ్ళు, ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా జెయిలుకేలే" అని భయపెట్టినట్లు తెలియవచ్చింది.

దర్మిలా, ఆయనతోపాటే అన్ని రాష్ట్రాలలోని ముఖ్య నాయకులనూ కూడా అరెస్టు చెయ్యమని వచ్చిన హుకుంతోనే పైవిధంగా సృష్టించబడిన రకరకాల కారణాలతో, వారిని నిర్భంధించి జెయిళ్ళలో పెట్టారు. బ్రిటిష్ తీరాన్ని వదిలేముందు గాంధీగారిని హెచ్చరించీ, చిన్నబుచ్చీ, అవమానపరచీ పలికిన పలుకుల ఫలితంగానే గాంధీగారు