పుట:Naajeevitayatrat021599mbp.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళ్ళీ దిగజారిపోయారు. ఎన్ని వేలమంది జెయిళ్ళకు వెడితేనేం, పోరాటం ఎంత ముమ్మరంగా సాగిపోతేనేం - తుదకు మిగిలినదంతా దిగజారుడే. ఈ పరిస్థితికి కారణం ఆ 1917 - 18 నాటి అనిబిసెంటమ్మ విధానమే తిరిగీ ఈ 1930 లో కూడా, బ్రహ్మాండమయిన యుద్ధం మధ్య ఉండీకూడా, అవలంబించడమే.

అగ్రనాయకులు విడుదల, ఇర్విన్‌తో ఒడంబడిక

ఎంతగా తమ్ముతాము బయటపెట్టుకున్నా తమ్ముతాము సంబాళించుకోగల నేర్పరితనం కాంగ్రెసువారిలో ఉండబట్టే, ఆ 1930 ఆఖరునాటికి తిరిగీ ఈ కయ్యం ముమ్మరం అవడమూ, దాన్తో 1931 మొదటి రోజులలోనే బ్రిటిష్‌వారు కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులుగా పనిచేసిన ఆ పాత వారినీ, కొత్త వారినీకూడా వదలి పెట్టడానికి నిశ్చయించు కోవడమూ, అప్పుడే వారికి వైస్రాయ్ గారితో నిర్మల వాతావరణంలో తర్జన భర్జనలు చేయడానికి సదవకాశం ఉంటుందని గ్రహించగలగడమూ జరిగింది.

అసలు న్యాయానికి ఇదే సవ్యమయిన మార్గ మవడాన్ని 1930 జూలై - ఆగస్టులలోనే ఇలాంటి విడుదల ప్రయత్నాలు జరిగి ఉండ వలసినది. ఈ ప్రకారం నాయకులు విడుదల అయిన వెంటనే, గాంధీగారూ ఇర్విన్ కలిసి సక్రమంగా సంప్రతించడానికి సావకాశం కలగడమూ, సంప్రతింపులు సఫలమై, సంతకాల దాకా రావడమూ, దానిని గాంధీ - ఇర్విన్ ఒడంబడికగా రూపొందించగలగడమూ జరిగింది. ద్వంద్వ నాయకత్వమూ, వారిలో వారికి కలిగిన అభిప్రాయా భేధాలూ, కాంగ్రెసు వారి కోరికలు 1917 - 18, 1928 - 29, 1930 లలో విఫలం అవడానికి కారణా లయ్యాయి.

ఈ గాంధీ ఇర్విన్ సంప్రతింపులు సఫలం అవడానికి కూడా కారణాలు గాంధీగారు వెనుకటి అపజయ కారణాలను గ్రహించ గలగడం, తానే యావత్తు భారత దేశానికి కాంగ్రెసు తరపున ఏకైక నాయకునిగా, నిలిచి, సంప్రతింపుల విషయంలోనూ, సవరణలూ, దిద్దు