పుట:Naajeevitayatrat021599mbp.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్న రౌండ్‌టేబిల్ సమావేశంలో కాంగ్రెసువారు కలిసివస్తే మంచిది అంటూ కాంగ్రెసు వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. మోతీలాల్‌నెహ్రూగారి అభిప్రాయాలు స్లోకోంబ్‌కి అందచేస్తూ, సప్రూ - జయకర్లు మధ్యవర్తిత్వం వహించడానికి పూనుకున్నారు. స్లోకోంబ్‌ యందు కలిగిన విశ్వాసం వల్లనో, లేక స్లోకోంబ్ ఆంగ్లేయుడయిన కారణంగా - తమ వాంఛలను సరిగా నివేదించ గలడనో, మోతీలాల్‌గారు తాను తన దేశానికి బ్రిటిష్ వారి వద్దనుంచి వాంఛించే దేమిటో ఆ విలేఖరి కెరుక పరచాడు

"కాంగ్రెసువారు రౌండుటేబిల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ముందు, భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వడం ఖాయమని ఆంగ్లేయులు రహస్యంగా వాగ్దానం యివ్వాలి. ఈ వాగ్దానానికీ, రౌండ్ టేబిల కాన్ఫరెన్స్‌వారి సలహాలకీ, పార్లమెంట్‌వారు చేయదలచు కున్నదానికీ లంకె ఉండరాదు. కాంగ్రెసు వారికి బ్రిటిష్‌వారూ, వైస్రాయిగారూ రహస్యంగా ఇచ్చిన ఈ వాగ్దానం, కాన్ఫరెన్స్‌వారూ పార్లమెంట్ వారూ ఏవయినా ప్రత్యామ్నాయ సూచనలు చేస్తే, వారు చేసిన ఆ చిట్ట చివరి సూచనలకు లోబడే తాము ఇచ్చిన వాగ్దానాన్ని చెల్లించుకోవచ్చు"నని మోతీలాల్‌గారు స్లోకోంబ్‌కి తెలియజేశారు. మోతీలాల్ గారి సూచనలను గాంధీగారి ఎదుటా, ఇంకా కొందరి నాయకుల ఎదుటా ఉంచడానికి సప్రూ - జయకరుగారలు వైస్తాయ్‌గారి అనుమతి కోరారు. భారత ప్రభుత్వంవారు ఆనందంగా అనుమతిని ప్రసాదించారు. యెరవాడ జెయిలులో ఉన్న గాంధీగారిని చూడడానికి సప్రూ - జయకర్ గారలు వెళ్ళారు.

గాంధీగారి ప్రతిపాథనలు

ఎట్టి పరిస్థితిలోనయినా, ఏ విషయం మీదయినా, ఇంకొకరి ప్రోత్సాహం, పోద్బలం లేనంతవరకూ గాంధీగారికి ఎప్పుడూ నిశ్చిత అభిప్రాయా లుంటాయి. పూర్తిగా బాధ్యతాయుత ప్రభుత్వం భారత దేశానికి ఇస్తామని బ్రిటిష్ గవర్నమెంట్‌వారి తరపున భారతప్రభుత్వం వారు హామీ ఇవ్వాలనీ, ఈ హామీని రౌండు టేబిల్ కాన్ఫరెన్స్‌వా రంగీ