పుట:Naajeevitayatrat021599mbp.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించబడింది. మహాత్మా గాంధీగారికిని, మోతీలాల్ నెహ్రూగారికిని ఈ తీర్మానం పట్ల ఎలాంటి అభిలాషా లేదు. 1885 నాటి ప్రథమ కాంగ్రెస్ లగాయతు బెంగాల్, కాంగ్రెసుపట్ల ఆదరాభిమానాలతోనే ఉంటూ వచ్చింది. కాని దర్మిలా తిరుగుబాటుదారీ విధానాలకు ఆలవాలం అయింది. చాలాకాలం ఆ తిరుగుబాటుదారీ విధానం బెంగాల్‌లో నాటుకు పోయింది. బెంగాల్ యువకులు ఎందరో అహింసా పద్ధతిని దేశాన్ని సేవించగోరి ఎన్నో సాహసకార్యాలుచేసి మృతజీవులయ్యారు. గాంధీగారి అహింసాత్మక విధానం క్రమేపీ బెంగాల్ యువకుల మనోతత్వాలమీద పనిచేసి, 1923 నాటికి వారిని శాంతపరచి, మితవాదులనుగా తయారుచేసింది. అటువంటి పరిస్థితులలో, 1928 లో కాంగ్రెస్ తిరిగీ కలకత్తాకు ఆహ్వానించ బడింది. నాటి కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎవరిని నిర్ణయించాలి అన్న ఆలోచనలో బెంగాల్ వారిదృష్టి మోతీలాల్ నెహ్రూ మీద పడింది. నిజానికి ఆయనే తన కుమారునిచే ప్రతిపాదించ బడిన స్వాతంత్ర్య తీర్మానాన్ని తిరగతోడగలడని వారు భావించారు. ఈ కథ అంతా లోగడ మనవిచేసే ఉన్నాను.

1918 లో డా॥ అనిబిసెంట్‌లా, కలకత్తాలో పండిత మోతీలాల్ నెహ్రూ తన అధ్యక్ష ఉపన్యాసం లోనే స్వాతంత్ర్య తీర్మానాన్ని వెనుకకు నెట్టి అఖిల పక్ష సమావేశం అంగీకరించిన పథకాన్ని ముందుకు పెట్టి, కాంగ్రెస్ దానినే ఆమోదించవలసిందని సూచించాడు. కాంగ్రెసు ఆశయం మాత్రం పూర్తి స్వాతంత్ర్యమే అంటూ కూడా, బ్రిటిష్ వారు, ఈ దేశ పరిస్థితులను బాగా గమనించి, ఏమిచ్చినా సంతోషమే అన్నాడు.

గాంధీగారు చూపించిన మార్గాన్ని అనుసరించి సైమన్ కమిషన్ బహిష్కరణ విషయంలో అంతటి మహోన్నత శిఖరాన్ని అధిష్టించిన కాంగ్రెసువారే, ఆంగ్లేయుల వద్దనుంచి తమ వాంఛితార్ధమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలను పిండాలని తలుస్తూనే, దేశం తరపున, దేశీయుల తరపున స్వాతంత్ర్యమే తమ ఆదర్శం అని చెపుతూనే, ఏక్ దమ్ దిగజారిపోయి, సైమన్ కమిషన్ వారినుంచి, అధమం పరిపూర్ణమైన