పుట:Naajeevitayatrat021599mbp.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తిగతమైన అభిప్రాయంతో ఆయన్ని ముంచెత్తకుండా ఉండి ఉండవలసింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా, ఆయన సొంత డబ్బా వాయించి, దేశానికి తీరని అన్యాయం చేశాడు. శ్రీనివాసయ్యంగారు తనకు తానుగానే వచ్చి కలుసుకున్నాడనీ, తనముందు సాక్ష్యం ఇవ్వడానికని ఆయన్ని ఎవ్వరూ ఆహ్వానించలేదనీ మాంటేగ్ తన డైరీలో వ్రాసుకున్నాడు. ఆయనకి తనకి అప్పట్లో రాజకీయాలతో సంబంధం లేకపోయినా, అడ్వకేట్ జనరల్‌గా మాటాడిన కారణాన్ని మాంటేగ్ ఆయన అభిప్రాయం మీద విలువ ఉంచవలసి వచ్చింది.

అప్పటికి పండిత మోతీలాల్ నెహ్రూకీ రాజకీయాలతో సంబంధం లేదు. అయినా ఆయన, తన స్వంత అభిప్రాయంగా, మాంటేగ్‌తో ఇప్పటినుంచి ఇరవై యేళ్ళ లోపుగా భారత దేశానికి బాధ్యతాయుత ప్రభుత్వం (Responsible Government) ఇస్తే జనం సంతోషిస్తారని చెప్పాడు. ఇలాంటి సాక్ష్యాలు ఆధారంగానే, మాంటేగ్ 'రౌండ్ టేబిల్‌' పత్రికాధిపతి లయొనెల్ కర్టిస్ (Lionel Curtis) సలహా ప్రకారం, ద్వంద్వ ప్రభుత్వ సూచనలు చేసి ఊరుకున్నాడు.

కొంతమంది నాయకులే గనుక ద్రోహంచేసి ఉండకపోతే, వెంటనే 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' (Provincial autonomy) స్థాపన అయిఉండేది. దానిని అనుభవిస్తూ, పూర్తి బాధ్యతలకోసం ఆందోళనచేస్తూ ఉండిఉంటే, అటువంటి పూరాపూచీగల ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికీ ఏ పది సంవత్సరాలలోపుగానో, సాధించి ఉండేవారం. భారతదేశ చరిత్ర వేరు విధంగా రచియింపబడి ఉండేది.

ఈ పట్టున ఆ 1918 - 19 నాటి స్థితికీ, సైమన్ కమీషన్ బాయ్‌కాట్ నాటి స్థితికీ (1928 - 29) విలియా వేయడం న్యాయం.

1928 లో జరిగిన కథ

మదరాసులో 1927 లో జరిగిన కాంగ్రెస్‌లో పండిత జవహర్‌లాల్ నెహ్రూచే ప్రతిపాదించబడిన 'స్వాతంత్ర్య' తీర్మానం ఆమో