పుట:Naajeevitayatrat021599mbp.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన ధర్మమా అని, మాంటేగ్ తనతో శ్రీనివాసయ్యంగారు చెప్పిన విషయాలన్నీ తు. చ. తప్పకుండా, తన డైరీలో వ్రాసుకున్నాడు.

మాంటేగ్ కథనం ప్రకారం శ్రీనివాసయ్యంగారు భారత దేశంలో ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ - లీగ్ పథకం పట్ల సుముఖంగా లేరనీ, అందువల్ల ఆయన దానిని మన్నించవలసిన అవసరం ఉండదనీ, ఆశాజనకంగా ఏదో అనుగ్రహిస్తాం అని అంటే, చిత్తం అలాగే తమ దయ అని ప్రజలంటారనీ నమ్మబలికినట్లు తెలియవస్తోంది. అప్పట్లో శ్రీనివాసయ్యంగారు చెన్నరాష్ట్రానికి అడ్వకేట్ జనరల్.

ఇటువంటి పరిస్థితులలో, కాంగ్రెసు 'డిమాండ్‌'ను కాదని, ఏదో ద్వంద్వప్రభుత్వ పద్ధతిని ఆ మాంటేగ్ - ఛెల్మ్స్‌ఫర్డ్‌గారలు దేనినో ఇస్తామని ఊరుకున్నారు. మాంటేగ్ రాకముందు, ఆయన చాలా సరళ హృదయంతోనూ, సదభిప్రాయంతోనూ వస్తున్నాడనే అందరూ భావించారు. ఆయన వచ్చినప్పుడు దేశీయులు గట్టిగా తమ అభిప్రాయాన్ని నొక్కి వక్కాణించ గలిగిఉంటే 'ప్రొవిన్షియల్ ఆటోనమీ' లాంటి దేదయినా భారతీయుల కివ్వడానికి ఆయన ఆయత్తపడేవాడు.

డా॥ అనిబిచెంట్ 1917 కు పూర్వం భారతదేశానికి ఎంతో సేవ చేసి, భారతదేశానికి 'హోం రూల్‌' ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని స్వాతంత్ర్య సమరం సందర్భంగా జెయిలుకు కూడా వెళ్ళిన ఇల్లాలు. పైగా మాంటేగ్ వచ్చేముందు, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, భారతదేశానికి స్వపరిపాలనావకాశం కలుగజేసితీరాలని గట్టిగా చెప్పింది. కొద్ది నెలలో ఆమె తత్వం పిరాయింపవడమేగాక, తన అభిప్రాయమూ, సర్ శంకరన్ నాయర్ అభిప్రాయమూ ఒకటేనని చెప్పడాన్ని, అనుకోకుండా, పప్పులో కాలేసింది.

శ్రీనివాసయ్యంగారు అడ్వకేట్ జనరల్‌గా ప్రజాహృదయాన్ని గుర్తెరిగినవాడే. తనకు తానే మాంటేగ్‌ను కలిసి మాటాడగోరి, తన