పుట:Naajeevitayatrat021599mbp.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జెయిళ్ళలో ఉన్న ఖైదీల మనోభావాలు అల్లా ఆశా నిరాశల మధ్య ఊగులాడాయి. ఆ పరిస్థితిని అపసవ్యంగానూ, అస్తవ్యస్తంగానూ చక్కబెట్టిన దానికి ప్రతిఫలం అది. వారు చేసిన ఎన్నో త్యాగాలకు ప్రతిఫలంగా, గౌరవ ప్రదమయిన పరిష్కారం జరుగనున్నదని ఖైదీ లెంతగానో ఆశించారు.

విడుదలకి అసలు కారణం

కాని అసలు జరిగిందేమిటంటే, సెక్రటరీ ఆఫ్ స్టేటూ, బ్రిటిష్ క్యాబినెట్టూ నవంబరు 30 వ తేదీని జరిగిన ఆ మొదటి రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెసువా రెవ్వరూ లేని కారణంగా అది వట్టి బూటకపు నాటకమే అయిపోయిందని గ్రహించి, ఆ రౌండ్ టేబిల్ కార్యక్రమాన్ని ముందు సంవత్సరానికి వాయిదా వేసి, దానిలో పాల్గొనడానికి కొంతమంది కాంగ్రెసువారికి అవకాశం కలుగజేయడానికి మాత్రమే, ఒక్క యేడాది పూర్తి జెయిలు అనుభవాలతో ఉన్న అన్నివర్గాల కాంగ్రెసు నాయకులనూ విడుదల చేశారు.

గాంధీగారిని యావత్తు భారతదేశానికీ ఏకైక నాయకునిగా గుర్తించి, వైస్రాయ్‌గారు ఆయనతో సంప్రతింపులు ఆరంభించారు. ఆ సంప్రతింపుల పర్యవసానంగానే, గాంధీ - ఇర్విన్ ఫ్యాక్టు అనే ఒక ఒప్పందానికి ఆ ఇరువురూ రావడమూ, ఆ ఒప్పందాన్ని అనుసరించి దేశంలో అన్నిప్రాంతాలలోనూ జెయిళ్ళలోఉన్న కాంగ్రెసు వారినందరినీ ఏకంగా జెయిళ్ళనుంచి విడుదల చెయ్యడమూ, దాని మూలంగా మేము కన్ననూరు జెయిలునుంచి బయట పడగలగడమూ సంభవించింది.

కాంగ్రెసువారి కాళ్ళబేరం

ఊహించ శక్యంగానంత ఘనంగా సైమన్ కమీషన్ బహిష్కరణ జరుపగలిగిన కాంగ్రెసు పార్టీవారు, అనగా ఆ పాతకాలపు స్వరాజ్య పార్టీ నాయక వర్గం ఎంతో ఓరిమి వ్యక్తం చేసే తమ మితమైన వాంఛలతో బ్రిటిష్‌వారినీ, బాహ్య ప్రపంచాన్నీకూడా తాము కోరిన కోర్కెలు చాలా పరిమితంగానూ, సబబైనవిగానూ ఉన్నాయని