పుట:Naajeevitayatrat021599mbp.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తూన్న కాంగ్రెస్ ఖైదీలూ, ప్రజానీకమూ పేపరు వార్తలు చూసి, వాటిని నమ్మి ఎల్లా తెలివి తక్కువగా ప్రవర్తించారో గ్రహించిన వైస్రాయి మాత్రం జరిగిన సంఘటనల కన్నింటికీ తనలో తాను కులుకుతూ ఆనందించి ఉండి ఉండచచ్చును.

జూలై - ఆగస్టు మాసాల దర్మిలా ఎలాంటి సమాచారమూ అందని కారణంగా ఏ విధమయిన తాజావార్తలూ ప్రకటించడానికి పత్రికలవారికి అవకాశమే చిక్కలేదు. మేమంతా గాంధీగారికీ, వైస్రాయిగారికీ మధ్యను నడస్తూన్న సుదీర్ఘ చర్చల కారణంగా రాజీ కుదరడం ఆలస్యం అయిఉండవచ్చునని భావించాం. అందువల్ల చర్చలలో పాల్గొన్న ఆ ఇరువురు ముగ్గురు నాయకులకూ తప్ప తదితరుల కెవ్వరికీ ఏ విధమయిన వార్తలూ అందక పోవడాన్ని, కాస్త ఆలస్యం అయినా ప్రతిపాదనలు మాత్రం ఫలవంతంగానే ముగుస్తాయి అనే ఆశతోనే ఉన్నాం. అదృష్టవశాత్తూ, ఆ ప్రయత్నాలు ఏనాడో విఫలమయ్యాయన్న ముక్క వినబడలేదు. విఫల మయాయన్న వార్త విని ఉంటే ఎంతో నిరుత్సాహ పడిపోయి, ఎలాంటి అలజడులు రేకెత్తించే వారిమో! "As dead as Queen Anne" అన్న ఈ ఆంగ్ల జాతీయం ఈ ప్రతిపాదనలకు బాగా వర్తిస్తుంది.

రాజకీయ ఖైదీల విడుదల

1930 జూలైలో ఆరంభం అయిన రాజీ ప్రతిపాదనలు విజయవంతంగా జరిగాయని నమ్మడం నిజంగా చాలా దు:ఖకరమైన విషయం. నిజానికి, నాయకులను సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇచ్చిన ఒక ఆర్డరు ప్రకారంగా విడుదల చేయడమన్నది మొదటి రౌండ్ టేబిల్ కాన్పరెన్స్ అయిన తరవాత జరిగింది. కాంగ్రెసు తరపున తమ ప్రతిపాదనలు చెయ్యడానికి నాయకులను, వారిలో - వారు సంప్రతించుకోడానికి వీలుగా, విడుదల చెయ్యడమే సవ్యమయిన మార్గం. జూలై - ఆగస్టుమాసాలలో రాజకీయ ఖైదీలు పడిన ఆశ క్రమేపీ వృద్ధయి, పరిష్కారం ఆలస్యం అయ్యే సరికి నిరాశ మరీ ఎక్కువయి పోయింది. ఆ ప్రకారంగా ఆనాడు