పుట:Naajeevitayatrat021599mbp.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొందాడు. నవ్వుముఖంలో, తాను గంజాం జిల్లాలో ఉంటూండగా నేను ఆయన ఎదుట ఒక కేసులో హాజరయిన ఉదంతాన్ని గురించి చెప్పాడు. అయన చెప్పిందాకా నాకా ఉదంతం గుర్తుకు రాలేదు. తరవాత జెయిలు అధికారులను ఎందువల్ల నాకు అటువంటి సదుపాయల కలుగ జేశారని అడిగాడు. నేను ప్రభుత్వం వారి అనుమతిని సంపాదించానని సూపరింటెండెంట్ చెప్పాడు. నేను కాంగ్రెసు పరిపాలనా దినాలలో రెవిన్యూ మంత్రిగా ఉంటూన్న కాలంలో ఆ ఉడ్స్‌దొర నా చేతికింద ఒక జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. ఆయన విషయంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. అది చాలా ముచ్చటయిన కధ. దానిని 'కాంగ్రెసు పరిపాలన' అన్న శీర్షికలో పొందుపరుస్తాను.

11

గాంధీ - ఇర్విన్ ఒడంబడిక, మా విడుదల

కాంగ్రెసు వారు నడిపిన ఉప్పు సత్యాగ్రహ సమరం పూర్తి విజయాన్ని సాధించిన కారణంగా, ఆంగ్లేయులకూ మనకూ మధ్య రాజీ షరతులు ప్రతిపాదించబడుతున్నాయనీ, రాజీ కుదరవచ్చుననీ పత్రికా ముఖంగా తెలియరావడంతోనే, సత్యాగ్రహ ఖైదీల కందరికీ నూతనోత్సాహం బయల్దేరింది. తాము ఎప్పట్లో బయటపడగలమా అన్న ఆతురతా బయల్దేరింది. వారిలో చాలామందికి బ్రిటిష్‌వారి తత్వం తెలియదు. నాయకులకు కూడా ఏవేవో తీరని కోర్కెలు ఉత్పన్నమయినాయి. కాంగ్రెస్ వాలంటీర్లూ, వర్కర్లూ మొదలైన చిన్న పెద్ద లందరూ, నాయకులను నిశ్చింతగానూ, గ్రుడ్డిగానూ అనుకరిస్తూన్నారన్న విషయం మాత్రం అందరూ ఎరిగి ఉన్నదే.

నేను కాంగ్రెసు 'కాబినెట్‌'లో ఉన్నది స్వల్పకాలమే అయినా, అ 1921 - 22 మధ్య దినాలలో ఉండిన ఆ కాబినెట్ వారి 'లోగుట్లు' నాకు బాగా అర్థమయ్యాయి. దర్మిలా నేను రాజీనామా ఇచ్చిన తరవాత