పుట:Naajeevitayatrat021599mbp.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశంలో వారి స్టేట్ బ్యాంక్ బ్రాంచీలు సుమారుగా దేశం అన్ని ప్రాంతాలలోనూ కలిపి 1700 ఉండేవి. అవన్నీ మూత పడినట్టే గదా! అంటే గవర్నమెంటు దివాలా తీసిందన్నమాట! అందువల్ల వారు తమ బ్యాంకులముందు బ్యాంకులో డబ్బు దాచుకున్న వారికిగాని, తమతో వ్యాపార సంబంధాలున్న వారికిగాని డబ్బు వాపసు ఇవ్వబడదు అని వ్రాసిన ప్రకటన కాగితాలు అతికించ వలసివచ్చింది.

ఇటువంటి పరిస్థితులెల్లా ఉత్పన్నం అవుతాయో గ్రహించ గలగడాన్ని, ఆ ఆర్థిక విధానాలను గురించి క్షుణ్ణంగా చదవాలనీ, వాటిని గురించి జెయిలులో ఉన్న ఆ రోజులలో వ్రాయాలనీ బుద్ధి పుట్టింది. ఆ ప్రకారంగా, అటు కేంద్ర శాసన సభలోనూ, ఇటు జెయిలులోనూ గ్రహించిన విజ్ఞానంతో ఆర్థిక విధానాదులను క్షుణ్ణంగా చర్చించి ఆ పుస్తకాలు వ్రాయగలిగాను.

ఆ పుస్తకాలను చదివిన మన నాయకులకూ, ప్రజానీకానికీ కూడా అనువైన సందర్భాలలో ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నట్లయితే పూర్ణ స్వాతంత్ర్య సముపార్జన సులభ సాధ్యమ వుతుందన్న విషయం కరతలామలకం అవుతుంది. ఏ యే సందర్భాలలో ఆ ఆర్థిక విధానాలు ఎల్లాంటి దారులు తీస్తాయో, ఆ యా సమయాలలో ఎక్కడ నొక్కితే అవి చక్కపడతాయో వివరించడాన్ని, సందర్భ శుద్ధిగా సాగించే సత్యాగ్రహాలూ, సహకార నిరాకరణాలూ, శాసన ధిక్కారాలూ ఉపయోగపడే తీరులన్నీ మన నాయకులు గ్రహించడానికి ఆ పుస్తకాలు బాగా ఉపయోగ పడతాయి.

గాంధీగారు చెయ్యమన్నప్పుడల్లా సత్యాగ్రహం చేసి జెయిళ్ళు నింపడం కంటె, కీలెరిగి వాత పెట్టడం మంచిది కాదా? నా పుస్తకంలో పశ్చిమ జాతులవారు ప్రాపంచిక ఆర్థిక విధానాన్ని ఎల్లా పెంపొందించారు, వారు ఏ ప్రకారంగా అమెరికా యునైటెడ్ స్టేట్స్ వారితో కలిసి ఆ ఆర్థిక విధానాన్ని ఎల్లా ఎల్లా రూపొందించ పూనుకున్నారు అన్న విషయాలను గురించి పూర్తిగా చర్చించడానికి సావకాశం లేక పోయినా, నా పుస్తకం చదివిన ఒక్కొక్కరికీ ఆంగ్లేయులు ఏ యే