పుట:Naajeevitayatrat021599mbp.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటిది "ప్రపంచ ఆర్థిక విధానము" (Monetary system of the world), రెండవది "భారతీయ ఆర్థిక విధానము" (Indian Monetary system). ఈ పుస్తకాలు రెండూ ఆంగ్లంలో వ్రాయకలిగాను.

కేంద్ర శాసన సభలో సభ్యునిగా ఉంటూ ఉండిన ఆ మూడు సంవత్సరాలలో, నాకు అభిమాన విషయమైన ఈ ఆర్థిక విధానాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధతో గమనిస్తూ, ఆ విషయమైన ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాదోపవాదాలలో పాల్గొంటూ ఉండేవాణ్ణి. అ కారణంగానే రిజర్వు బ్యాంక్ బిల్లూ, మారకపురేటు ప్రసక్తి వచ్చినప్పుడు క్షుణ్ణంగా ఆ విషయంలో వాదించగలిగాను. అదృష్టవశాత్తూ జెయిలులో ఉండగా ప్రపంచ ఆర్థిక విధానానికి తగిలిన దెబ్బను గురించీ, ప్రపంచ ఆర్హిక విధానాలూ - అవి భారత ఆర్థిక విధానంపై తెచ్చిన ఒత్తిడిని గురించీ క్షుణ్ణంగా చదవడానికి అవకాశం చిక్కడాన్ని, "భారత ఆర్థిక విధనమూ," "ప్రాపంచిక ఆర్థిక విధానమూ" అన్న మకుటాలతో ఆ రెండు పుస్తకాలూ వ్రాయాలని బుద్ధి పుట్టింది.

అప్పట్లో ప్రపంచ ఆర్థిక విధానానికి తగిలిన దెబ్బ, లోగడ ఎప్పుడూ తగలనంత గట్టిగా తగలడాన్ని, ఆ విషయాన్ని గురించి శ్రద్ధగానూ, పరిశీలనగానూ, క్షుణ్ణంగానూ చదివి సంగతి సందర్భాలు సరిగా గ్రహించగలిగాను. ఆ తెల్లజాతులవారు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వారితోనూ వర్తక వ్యాపారాది సంబంధాలు కలిగిఉండడాన్ని ఆయా దేశాలలో ఉండే మార్కులో, షిల్లింగులో, డాలర్లో, రూబిల్సో, రూపాయలో - అవి యేవయినా, వాటిమధ్య మారకపు విధానమూ, తద్వారా అనేక నిత్య అవసర వస్తువుల ధరలూ అన్నీ ఆ తెల్లజాతులవారు తమ చేతులలో పెట్టుకున్నారు. నిజానికి ఏదేశపు ఆర్థిక విధానమైనా ఆ రెండింటి మీదే కదా ఆధారపడి ఉండేది?

ఈ సందిగ్ధ పరిస్థితులలో ఆంగ్లేయులు 7 షి. అమ్మవలసి ఉండగా, జర్మనీ దేశపు 'మార్కు' 200 పాయింట్లు పెరగడాన్ని జర్మనీవారు తమ స్టేట్ బ్యాంక్‌ని మూసి వేయవలసి వచ్చింది. వారి