పుట:Naajeevitayatrat021599mbp.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లాసు ఖైదీల ఉపయోగానికి మాత్రమే ఒక 'ఔట్‌హౌస్‌' ఇచ్చేవారు. తరవాత అందరి ఉపయోగంకోసం ప్రత్యేకంగా వంటశాల ఏర్పడింది. ఏవో నిర్ణీత దినాలలో నిర్ణయించబడిన కాలంలో 'బి' క్లాసు వారికి మాత్రం మమ్మల్ని కలుసుకుని కాలక్షేపం చెయ్యడానికి అవకాశం కల్పించబడింది. ఇతర సమయాలలో ఆ కాంపౌండ్ ద్వారాలు బంధించబడి ఉండేవి. వారికి తోచినప్పుడల్లా వీలునుబట్టి 'బి' క్లాసువారు గోడలుదాటి, కాలక్షేపానికి గాను మా 'ఎ' క్లాసు ఆవరణలోకి వచ్చేవారు.

తన అధీనంలో అప్పగించబడిన రాజకీయ ఖైదీల విషయంలో మేజర్ ఖాన్ చాల చాకచక్యంగా వ్యవహరించేవాడు. ఒకటి రెండుసార్లు మా 'ఎ' క్లాసు ఖైదీలు ప్రక్కనున్న ఆడవాళ్ళ జెయిలుకు వెళ్ళి పరిస్థితులు గమనించగల అవకాశం కలిగించాడు. తమని ప్రత్యేకించి ఎక్కడో ఎవరిముఖాలూ చూడడానికి వీలులేకుండా బంధించారన్న బాధలేకుండా వారికి జీవితం గడచిపోయేది. ఎన్ని చేసినా ఒక్కొక్కప్పుడు యువక ఖైదీలతో ఏదో భేటీ వచ్చేది. అలాంటి పరిస్థితులను మేజర్ ఖాన్ మా సహాయంతో ఎదుర్కొనేవాడు.

అప్పట్లో నాతోపాటు వెల్లూరు జెయిలులో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు, బులుసు సాంబమూర్తి (మదరాసు శాసన సభ మాజీ స్పీకరు), విశ్వనాథదాసు (ఒరిస్సా రాష్ట్రానికి కొంతకాలం ముఖ్యమంత్రి), డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య (దర్మిలా నాగపూరులో గవర్నరుగా కూడా ఉండేవారు. కాంగ్రెసు చరిత్ర వ్రాశారు), చక్రవర్తుల రాజగోపాలాచారిగారు (కొంతకాలం మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి) ఎస్. సత్యమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన వా రుండేవారు. ఎండకాలంలో ఆ ఆవరణ లోపలే ఆరు బయట పడుకోవడానికి మాకు అవకాశం కలుగ జేయబడింది. ఆరోగ్య విషయకంగా ఈ సహాయం మా కెంతగానో సహాయపడింది.

జెయిలులో వ్రాసిన పుస్తకాలు

ఈ ఆరు బయట పడక అమరడంతో నేను తలపెట్టిన రెండు పుస్తకాలూ వ్రాయడానికి నాకు అవకాశం లభించింది. అందులో