పుట:Naajeevitayatrat021599mbp.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడ్డాయి. శిక్ష విధించబడిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఖరీదు చేసే సరిక్రొత్త కారు జప్తుచేసి తీసుకుపోయారు. నన్ను మదరాసు పెనిటెంషరీలో కొంతకాలం ఉంచారు.

నాగేశ్వరరావుగారికీ నాకు వేసినట్లే శిక్ష వేశారు. ఆ తర్వాత ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన పలువుర్ని నిర్భధించి శిక్షించారు. జిల్లాలలో అరెస్టయి శిక్షపొందిన మిత్రులెందరినో వెల్లూరు జెయిలుకు తీసుకువెడుతూ, దారిలో పెనిటెంషరీకి తీసుకువచ్చేవారు.

లాఠీఛార్జీలు, కాల్పులూ మొదలు

నా అరెస్టు జరిగిన మర్నాడు ఒక బ్రహ్మాండమయిన సభ తిరువళిక్కేనీ సముద్రతీరాన స్వామీ వెంకటాచల చెట్టిగారి అధ్యక్షతను జరిగింది. నా అరెస్టుకు పూర్వం, నేను ఉద్యమం నడుపుతూన్న రోజులలో జరిగిన హింసాకాండ, ఆ గుర్రపు రౌతుల ద్వారా కోట ఎదుట ఇసుక మైదానంలో జరిగిన చిల్లర అల్లరే. అంతకుమించి, కాల్పులుగాని, లాఠీచార్జీలుగాని జరుగలేదు.

మొదటిసారిగా, స్వామీ వెంకటాచలంచెట్టిగారి ఆధ్వ్యరాన జరిగిన, ఆ మీటింగులో కాల్పులు జరిగాయి. ఆ జరగకూడదని ముందుగా నోటీసుగాని, మీటింగులనూ, ఊరేగింపులనూ నిషేధిస్తూ ఆర్డరుగాని లేకుండానే ఆ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు తిన్నగా, కొంతమంది పోలీసులతో ఆ సభలో జొరబడి, మీటింగును చెదరగొట్టి, వెంట వెంటనే లాఠీఛార్జీ, కాల్పులూ వగైరా జరిపించాడు.

ఆ కాల్పులు చాలా వివేక హీనంగానూ, ఇష్టంవచ్చినట్లు జరుపబడిన కారణంగా, ఒక గుండు వెళ్ళి, ఏ పాపమూ ఎరుగనటువంటి, ఈ సభతో ఎట్టి సంబంధమూ లేనటువంటి ఒక ప్లీడరుగారిని పొట్టబెట్టుకుంది.

దర్మిలా సత్యగ్రహుల నందరినీ అన్ని వైపులనుంచీ, అన్ని ప్రాంతాలనుంచీ పట్టుకుని శిక్షించే సందర్భంలో, ఒక కుగ్రామంలో ఉప్పు సత్యాగ్రహ విషయంగా, ఒక దేవాలయంలో జరుగుతూన్న