పుట:Naajeevitayatrat021599mbp.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదిహేనురోజుల పాటు వరసగా సవాలుచేస్తూ తిరిగినా ఏమీ జరగని కారణంగా, నాగేశ్వరరావు పంతులుగారికీ, నాకూ మా మా ఇళ్ళల్లోనే ఉప్పు చేద్దాం అనే బుద్ది పుట్టింది. వందలాది జనానికి సంతర్పణ చెయ్యడానికి పనికివచ్చేటంత పెద్దవిగా ఉండే గుండిగల్నికొన్నాం. మా మా ఇళ్లల్లో ఉండే పాత్రలలో కల్లా పెద్ద వాటిని బయటకు తీశాం. మా ప్రయత్నాలన్నీ పెద్ద యాగానికో, యజ్ఞానికో అన్నంత జోరుగా ఉన్నాయి.

ఇది యిలా జరుగుతూ ఉండగా ఎస్. వెంకట్రామయ్యరు అనే ఒక న్యాయవాద మిత్రుడు మా ఇంటికి వచ్చాడు. ఆయన మా గురువు గారయిన ఒక ప్రోపెసరుగారి కుమారుడు. నేను ఆ సమయంలో మా ఇంట్లో ఒక చాపపై ఒళ్ళు విరుచుకుంటూ పడుకుని ఉన్నాను. ఆయన వచ్చి, పోలీసువారు నన్ను త్వరలోనే అరెస్టు చేయనున్నారని తెలియజేశాడు.

నా అరెస్టు - తంగచ్చి సవాలు

ఇంతలోనే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, కొంతమంది పోలీసులతో, మా ఇంటికివచ్చి, మండుతూ ఉన్న ఆ మంటలను ఆర్పి ఆ పాత్రలను స్వాధీనం చేసుకుని నన్ను అరెస్టు చేశాడు.

ఆ సమయంలో అక్కడ తంగచ్చియమ్మ అనే ఒక ముసలి వాలంటీరు ఉంది. అక్కడ తయారయిన ఉప్పంతా పోసిన ఒక పెద్ద పళ్ళెం ఆమె చేతిలో వుంది. డిప్యూటీ కమిషనర్ ఆ పళ్లాన్ని తన కిమ్మని అడిగారు. ఆమె వెంటనే, "ఇది నీ సొమ్ముకాదు. సముద్రజలంతో కష్టపడి మేము దీనిని తయారు జేసుకున్నాం. ఆయనతోపాటు నన్నుకూడా ఎందుకు అరెస్టు చెయ్యవు?" అని అడిగింది. ఆమె చేతనుంచి ఆయన ఆ పళ్ళాన్ని బలవంతంగా లాక్కున్నాడు.

నాగేశ్వరరావు పంతులుగారిని కూడా వారి ఇంటివద్ద నిర్భంధంలోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ నన్ను ఆయన కారులోనే తీసుకుని వెళ్ళి, మేజస్ట్రేట్ గారి ముందు హాజరు పరచాడు. నాకు ఒక సంవత్సరం జెయిలు, నాలుగు వందల రూపాయలు జుల్మానా విధించ