పుట:Naajeevitayatrat021599mbp.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలిచిన స్త్రీలను అభినందించాను. దెబ్బలతో నా వద్దకు తీసుకురాబడిన వ్యక్తి, గుర్రం ముందుగా తన చుట్టూ తిరిగి మీదనుంచి గెంతిన తీరంతా పూర్తిగా వర్ణించి, అదృష్టవశాత్తూ తనకు అట్టే దెబ్బలు తగులలేదని వివరించాడు ఆ సంఘటన ప్రభుత్వం వారి నిరంకుశ కిరాతచర్యలకు వాచవి అయింది.

అబద్ధ మయిన మరణవార్త

అ పదిహేను రోజులలోను అనుదినమూ ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. మూడవసారికూడా నేను ఆ కోట ఎదుట ఉన్న ఇసుక మైదానంలో సభ యేర్పాటుచేసి మాటాడాలని తలపెట్టాను. ఆ సభకి చాలామంది జనమే వచ్చారు. అదిన్నీ సరిగా వెనుకటి సభ జరిగిన తావులోనే జరుపబడింది. వాలంటీర్లూ మొదలైన వారు చాలామంది తాము చేస్తున్న కృషిని వివరిస్తూ, సముద్రం పొడుగునా అనేక ప్రాంతాలలో వారు ఏ విధంగా ఉప్పును తయారుచేస్తున్నది, ఆ సముద్రతీరంలో పది పదిహేనుమైళ్ళ ప్రాంతం అంతా వారు ఏ ప్రకారంగా ఆక్రమించినదీ, వారు క్రమేపీ ఆ పట్నానికి చుట్టుపట్ల ఉన్న సముద్రతీర ప్రాంతాలలోని కుగ్రామాలలోకూడా ఎలా ఉప్పు చట్టాన్ని ఎదిరిస్తూన్నదీ వివరంగా చెప్పారు.

ఈ మీటింగులో నేను నిలబడి ఉపన్యాసం ఆరంభంచేసే సమయంలో, మశూచితో బాధపడుతూన్న నా రెండవ కుమారుడు మరణించాడన్న వార్త ఎవరో మోసుకొచ్చారు. వాడే గనుక చనిపోయి ఉంటే ఈ సమరంలో మున్ముందుగా ప్రాణాలు గోల్పోయింది వాడే అవుతాడని అన్నాను. మామూలుగానే నేను సభను నడిపాను.

సభానంతరం ఇంటికి వెళ్ళేసరికి ఆ కుర్రవాడు చనిపోలేదని తెలిసింది. వాడు చాలా తీవ్రంగా బాధపడుతూ మృత్యువువాత పడనున్న సమయంలో నా తమ్ముడు డా॥జానకిరామయ్య వాన్ని రక్షించగలిగాడని విన్నాను. మా తమ్ముడు ఆంగ్లేయ వైద్యంలో అఖండ ఖ్యాతి గణించినా, దాని పట్ట కలిగిన విముఖతతో హోమియోపతీ వైద్యాన్ని చేపట్టి, దానిని క్షుణ్ణంగా చదివి, గడ్డుకేసు లెన్నో సాధించి చాలా