పుట:Naajeevitayatrat021599mbp.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరవాత ట్రిప్లికేన్ బీచ్‌లోనూ, ఇతర ప్రాంతాలలోనూ కూడా సభలు జరగడమూ, వాటిలో ఇతర నాయకులూ, వర్కర్లూ కూడా మాటలాడడమూ, స్త్రీలు కూడా ప్రముఖ పాత్ర వహించడమూ జరిగింది.

మా తరవాత అరెస్టుకు సిద్ధంగావలసినదని దుర్గాబాయిని నేను కోరకపోయినా, ఆమె అందుకు సంసిద్ధమయి, మాతోపాటు అనుదినమూ ఊరేగింపులలో పాల్గొంటూ, మా తరవాత ఉద్యమాన్ని నడపడానికి కావలసిన సాధన సంపత్తి యావత్తూ ఆకళింపుజేసికో నారంభించింది.

రెండవ బహిరంగ సభకి సుమారు లక్షమంది జనం హాజరయ్యారు. మేము ఆ స్థలానికి జేరే లోపల పోలీసువారూ, మిలిటరీవారూ కూడా బహు సంఖ్యాకులుగా రోడ్డు పొడుగునా ఉండడమేగాక, కోట ప్రాంతంలో మాకు ఎదురు వరసలో వారు అసంఖ్యాకంగా కనబడ్డారు. గుర్రాలమీద సవారీ చేస్తూన్న రౌతులు (mounted sowars) కొంత మందున్నారు. వీరందరూ ప్రజా రక్షణకోసమే పిలిపించబడి ఉంటారనీ, ఏదయినా గలాటా వస్తే ప్రజా రక్షణచర్యలలో వారు పాల్గొంటారనీ తలచాను. మీటింగు మధ్యలో చెదరగొట్టే ఉద్దేశంతో వారక్కడ చేరారని మేము భావించలేదు.

మీటింగు మధ్యనుంచి రౌతుల స్వారీ

నేను ఉపన్యాసమిస్తున్నాను. ప్రజలు చెప్పినదంతా నిశ్శబ్దంగా జాగ్రత్తగా వింటున్నారు. హఠాత్తుగా ఆ గుర్రపు రౌతులు ఇసుకలోకి జోరుగా వచ్చి గుర్రాలను అదిలిస్తూ, ప్రజా సమూహం మధ్యనుంచి, ఆ చివరనుంచి ఇటు కోట గుమ్మంవరకూ జోరుగా స్వారీ చేసుకుంటూ రాజొచ్చారు. కొంతమంది జనం మీదుగా గుర్రాలు వెళ్ళినప్పుడు ప్రజలలో చెప్పరాని భీతి, దిగులూ పుట్టుకొచ్చాయి. ఒక శాంతియుతమయిన బహిరంగ సభను చెదరగొట్టడానికే అధికార్లు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని తాము గ్రహించే లోపలే ప్రజలు గుర్రాల త్రొక్కు