పుట:Naajeevitayatrat021599mbp.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసు సంఘంవారు కూడా, తమకొక ప్రత్యేక నివేదిక కోసం, ఒక ఉప సంఘాన్ని నియమించారు.

ఆ శాసన సభ కమిటీవారి తుది అభిప్రాయాలు ఎల్లా ఉంటాయో, వారు ఏ దృక్పథంతో ఈ విషయాలు పరిశీలిస్తారో అంతు చిక్కలేదు. ఆ మంత్రులు ఏ విధంగానూ ప్రజలకు బాధ్యులు కారు. వారి ఆలోచనలు ప్రజా సహకారం కాంక్షించేవిగా ఉంటా యనుకోవడానికి వీలులేదు. రెవెన్యూ శాఖ, కార్యనిర్వాహకవర్గపు సలహాదారుగా ఉన్న కాంప్‌బెల్ (Compbell) గారి చేతిలో, ఒక ప్రత్యేక విషయంగా ఉండేది. ఆ కమిటీ చైర్మన్ అభిప్రాయంతోగాని, ఆ ముగ్గురు మంత్రుల అభిప్రాయంతోగాని (వారి అభిప్రాయం అనుకూలంగా ఉన్నా), రెవెన్యూ మెంబరుగాని, ప్రభుత్వం తాలూకు రిజర్వుడు సెక్షన్ వారుగాని ఏకీభవించ నవసరంలేదు. అసలు, వారి అభిప్రాయాలను వీరు ఏ విధంగానూ పట్టించుకో నవసరంలేదు.

కాంగ్రెసు సంఘ నివేదిక

రైతుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది, అప్పటికే వారు భరించరాని పన్నులు చెల్లించవలసిన స్థితిలో ఉంటూ, అప్పులలో మునిగి ఉన్నారు. ఎప్పటి కయినా ఆ ఋణాలనుంచి బయటపడి, భూమికి నిజమైన హక్కుదార్లయ్యే అవకాశం ఏ మాత్రం ఉన్నట్లు లేదు. ఆ కమిటీవారి విచారణ సమగ్రంగా లేదు. అంతకంటె మా కాంగ్రెసు సంఘంవారి నివేదిక ఎంతో సమగ్రంగానూ, విమర్శనాత్మకంగానూ ఉంది.

నేను నా నియోజకవర్గంలోని మూడు జిల్లాలలోనూ గ్రామ గ్రామానికీ వెళ్ళి పరిస్థితులు సమగ్రంగా గ్రహించాను. వ్యవసాయపు పెట్టుబడులూ, వ్యవసాయానికయ్యే ఇతర ఖర్చులూ, ఫలసాయంవల్ల వచ్చే ఆదాయమూ పరిశీలిస్తే, రైతులకి ఖర్చులు పోగా వారి కుటుంబపోషణకి సరిపోయేపాటి ధనం కూడా మిగలడం లేదని తేలింది.

ఆ సెటిల్మెంట్ ఆఫీసరుగారు వ్యవసాయపు ఖర్చులు నిర్ధారణ చేయడానికి అవలంబించిన పద్ధతి గమనిస్తే, ఆ లెక్కలు సక్రమ మయినవి కాదని, తేలింది. అక్రమ పద్ధతిగా వేసిన ఆ లెక్కలు చూస్తే,