పుట:Naajeevitayatrat021599mbp.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ఉద్రిక్త పరిస్థితులలో అధ్యక్ష స్థానాన్ని అధిష్టించి, దేశాన్ని ప్రత్యక్ష చర్యలకీ, సిసలయిన స్వాతంత్ర్యానికీ లాక్కుని వెళ్ళగలడని భావించే అల్లా చేశాననీ అన్నాడు.

స్వాతంత్ర్య మన్నది కోప తాపాలతోనూ, ఉద్రిక్త రక్తపు పటిమతోనూ సాధించేదికాదనీ, అల్లాంటి తొందరపాటులతోనూ, ఉద్రిక్త పరిస్థితులలోనూ సంపాదించిన స్వాతంత్ర్యం చిరకాలం నిలువదనీ, చిన్నవాళ్ళ కాపురం చితుకుల మంటలా గప్పున చల్లారుతుందనీ ఆయనకు తెలుసు. ప్రత్యక్ష చర్యకు పూనుకునేముందు నిర్మాణ కార్యక్రమమన్నదే ప్రాతిపదికగా ఉండాలనీ, ఆ పద్ధతే సరయినదనీ ఆయనకి తెలుసు.

కాని పరిస్థితులు విషమించి ప్రత్యక్ష చర్య తప్పని సరి అయినప్పుడు స్వయంగా ఆయనే నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపేవాడు. కాని ఈ మాటు జవహర్‌లాల్ నెహ్రూను నాయకునిగా నిశ్చయించి, కాంగ్రెస్ అధ్యక్షుణ్ణిచేసి, తాను వెనక్కి తగ్గాడు. లాహోరులో "స్వాతంత్ర్య" పతాకం ఎగురవేయించి ఎటువంటి పరిస్థితులలో నయినా అ జెండాని కాపాడి తీరతాం అని ప్రమాణం చేయించి శాసన ధిక్కారానికి దారి చూపించింది లాహోరు కాంగ్రెస్. ఆంగ్లేయులకిచ్చిన గడువు వాయిదా 1929 డిసెంబరు 31 అర్ధ రాత్రితో ముగిసింది. అర్థరాత్రి దాటడంతోనే దేశీయమైన స్వాతంత్ర్య పతాకాన్ని ఎగుర వేయడమూ, సంపాదించిన స్వాతంత్ర్యాన్ని నిలుపుకు తీరతామనే 'స్వాతంత్ర్య' ప్రమాణాన్ని తీసుకోవడమూ జరిగాయి.

ఇండిపెండెంట్ పార్టీ

సుభాస్ చంద్రబోస్ - శ్రీనివాసయ్యంగార్ల అభిప్రాయాలకూ, కాంగ్రెసువా రవలంబిస్తూన్న విధానానికీ పొంతనం కుదరలేదు. 1922 గయా కాంగ్రెస్‌లో అపజయం సంభవించిన తరవాత దాస్ - నెహ్రూ గారలు కలిసి స్వరాజ్యపార్టీని స్థాపించడం, వారి మనోపథంలో మెదిలి, అటువంటి చర్యకే వారు దారి తీశారు.

కాంగ్రెసులో వ్యక్తంచేసిన వారి అభిప్రాయం యెప్పుడయితే