పుట:Naajeevitayatrat021599mbp.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిసెంబరు)లో ఆమోదించబడిన "స్వాతంత్ర్య" తీర్మానం మాట ఎత్తుకోకుండా, ఆంగ్లేయులను ఒప్పించగలమనే ఆశతో ఒక నూతన పథకాన్ని మితవాద రాజకీయ పద్దతిగా రూపొందించారు.

చేవ చెడిన కలకత్తా తీర్మానం

మదరాసు కాంగ్రెస్, భారతీయుల పేరుమీద - భారతదేశ ప్రజల కోసం ఆ 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని అంగీకరించి ఉంది. న్యాయానికి మన నాయకులు ఆ తీర్మానానికి భిన్నంగా, దాని శక్తిని సన్నగిల్లచేస్తూ, దానిని కొంతవరకూ నిర్వీర్యంచేస్తూ, 1928 డిసెంబరులో కలకత్తా కాంగ్రెస్‌లో చేసిన మార్పే చాలా నికృష్టమయింది.

ఇటువంటి క్లిష్ట సమయంలో నాయకుల మన: ప్రవృత్తిని అర్థంచేసుకోవడం కష్టమే. ఇదివరలోనే చెప్పానుగా, ఆంగ్లేయులకు వియ్యానికీ కయ్యానికీ కూడా ఒకే ఫాయ వారు కావాలనీ, వారికి బలహీనులయిన మనుష్యులను చూస్తే చికాకనీను?

చెన్నపట్నపు 'స్వాతంత్ర్య' తీర్మానాన్నే కలకత్తాలో మన నాయకులు బలపరచి ఉండిఉంటే, సైమన్ కమిషన్‌వారు వారి రిపోర్టులో విధిగా 'ప్రొవిన్షియల్ ఆటోనమీ'ని గురించీ, కేంద్రంలో కూడా ఇంకా ఎక్కువ భాధ్యతాయుతంగా పరిపాలనా యంత్రాన్ని నడిపించే విధానాన్ని గురించీ తప్పక ప్రస్తావించి, దేశీయుల కోర్కెను మన్నించేవారు. ఎప్పుడయితే మనలో స్థిరత్వం లేకపోయిందో, అప్పుడే వారు, ప్రపంచ చరిత్రకే విరుద్ధంగా, సంకరపు సంధి సూత్రాలతో దేశాన్ని అల్లా నగుబాటు పాలుచేశారు. వారు ఎప్పుడయితే మన నాయకుల బలహీనతను గ్రహించారో, అప్పుడే బిర్రబిగుసుకుపోయి, 1928 లో కలకత్తాలో కాంగ్రెసువారు సూచించిన ఆ మధ్యే మార్గపు సూచనను నలిపి పారేశారు.

ఈ బలహీనతే మోతీలాల్‌నెహ్రూగారి కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో కూడ వ్యక్తం అయింది. ఆ ఉపన్యాసంలో "మా పరమావధి స్వాతంత్ర్యమే కాని, దాని రూప రేఖలు కాలాను గుణంగానూ, పరి