పుట:Naajeevitayatrat021599mbp.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్క సమావేశం వరసగా ముప్పయిసార్లు జరిగిందంటే, అందులో ఎవరికీ విపరీతం ఏమీ కనిపించలేదు; అధిక వ్యయ ప్రయాసలనీ అనిపించలేదు.

మితవాద పథకం

అల్లా జరిగిన ఒక అఖిల పక్ష సమావేశానికి (1928, మే 19) డా॥ అన్సారీ అధ్యక్షత వహించాడు. అప్పుడు అఖిల పక్షాలవారికీ అంగీకార యోగ్యమయిన రాజ్యాంగ పథకాన్ని రచించడానికి (పండిత మోతీలాల్ అధ్యక్షతను) ఒక ఉప సంఘం యేర్పరచబడింది. ఆ కాన్ఫరెన్సులో ఈ దిగువ అంశాలు అంగీకరించబడ్డాయి: 1. బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించబడాలి; 2. హిందూ మహమ్మదీయ ఐక్యం సుస్థిరం కావాలి; 3. జాతి మతాల రీత్యా ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు ఉండాలో నిర్ణయం జరగాలి.

పై విషయాలను గమనిస్తూ వాటికి అనుగుణంగా రాజ్య తంత్రం రచించడానికి కేంద్రీకరించబడిన నాయకుల శక్తులన్నీ ఫలోన్ముఖం కాకుండా ఉంటాయా? ఈ ఉప సంఘంవారు తయారుచేసిన ఆ మోతీలాల్ నెహ్రూ రిపోర్టు అన్నది అన్ని కమిటీలవారూ దాని మంచిచెడ్డలు విచారించి అంగీకరించాలనే నిబంధనే గనుక లేకుండా ఉంటే చాలా దివ్యంగా ఉండేది.

ఈ రోజులలో శ్రీనివాసయ్యంగారు యూరపులో పర్యటిస్తున్నారు. ఆయన దేశ పర్యటన ఒక దుర్ముహూర్తాన ఆరంభించారన వలసి ఉంటుంది. ఆ ఫిబ్రవరి, మార్చి రోజులలోనే సైమన్ కమిషన్ వారు బహిష్కరణ భాగ్యాలనందుకుంటూ దేశంలో పర్యటిస్తున్నారు. అదే సమయంలోనే మేము నూతన రాజ్యాంగ పథకాన్ని రచించాలని పూనుకున్నాము.

అలా తయారయిన ఆ పథకం, హిందూ మహమ్మదీయు లుభయుల చేతనూ ఆమోదింపబడిన కారణంగా, ఆంగ్లేయులచేత తిరస్కరించబడడానికి అవకాశం లేనిదిగా రూపొందించబడింది. ఇది మా ఆశయం అంటూ మదరాసు కాంగ్రెస్ బహిరంగ సమావేశం (1927