పుట:Naajeevitayatrat021599mbp.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కున్నారు. కాగా ఆయన స్కీన్ (Skein) కమిటీ సభ్యత్వం కూడా స్వీకరించాడు. ఈ స్కీన్ కమిటీవారు సైన్యాన్ని పటిష్ఠంగా పునర్నిర్మాణంచేసే పద్ధతుల విషయమై సలహాలు చెప్పా లన్నమాట. ఆయన కాంగ్రెసు ఆశయాలకి అనుగుణంగానే ఆ పదవులను స్వీకరిస్తూన్నట్లు నటించారేగాని, నిజానికి కాంగ్రెసువారు ఇటు ఉద్యోగ స్వీకారానికిగాని, అటు ప్రభుత్వం వారితో సహకరించడానికిగాని వ్యతిరేకులే.

చెన్నరాష్ట్ర శాసన సభ్యులూ, ఇతర రాష్ట్రాలలోని శాసన సభ్యులు కొందరూ, కాంగ్రెసు ఆశయాలనుంచి దిగజారిన కారణంగా, వారిపై అవిశ్వాస తీర్మానం ఒకటి అఖిల భారత కాంగ్రెసు కమిటీలో ప్రవేశపెట్టబడింది. మహారాష్ట్రానికి చెందిన ఎన్. సి కేల్కార్‌గారినీ, డా॥ మూంజీగారినీ సమర్థించే సందర్భంలో, మోతీలాల్‌నెహ్రూగారు స్కీన్ కమిటీలోనూ, ప్రభుత్వ ప్రజాప్రతినిధి సభలోనూ ఉద్యోగ స్వీకారం చేయలేదా అనే ప్రశ్న వచ్చింది. 1928 లో మోతీలాల్‌గారు ఆ రెండు కమిటీలలోని సభ్యత్వానికీ రాజీనామా ఇచ్చేలోపల, కాంగ్రెసుపార్టీ చాలా దిగజారిపోయింది.

మా శాసన సభానుభవం

మూడు సంవత్సరాలపాటు కాంగ్రెసువారు శాసన సభలలో అధిక సంఖ్యాకులుగా ఉంటూ, ఎన్నో విషయాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినా, ప్రభుత్వంవారు ఏ ఒక్క విషయంలోనూ కూడా తమ పరాజయాన్ని అంగీకరించడమన్నది జరగలేదు. వారు ఇతర మార్గాలద్వారా తాము తలచినదాన్నీ, తమ పంతాన్నీ నెగ్గించుకుంటూ వచ్చారు. శాసన సభలో అనుభవాలు మాలో చాలా మందికి కనువిప్పు కలిగించి, ప్రజల్లో నిజమయిన పరిస్థితులను గురించి ప్రచారం చెయ్యడానికి బాగా ఉపకరించాయి. మా ఆశయాభివృద్ధికి మేము తగు ప్రచారం చెయ్యడానికి మాకు శాసన సభాస్థలి బాగా ఉపయోగపడింది.

మాకే గనక దేశీయ భాషా పత్రికల ద్వారానూ, కాంగ్రెసు నిర్మాణ కార్యక్రమం ద్వారాను శాసన సభలలో జరుగుతున్న భాగవతం పల్లెలలో నివసించే ప్రజానీకం దృష్టికి తేగల అవకాశం ఉంటే, నిజంగా