పుట:Naajeevitayatrat021599mbp.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రిపై జవహర్ ప్రభావం

అన్నింటికంటె, ఆయన తన కుమారుడు జవహర్‌లాల్ చర్యలతో ఎప్పుడూ సతమత మవుతూ వచ్చాడు. ఆయన గాంధీగారి సహకార నిరాకరణ ఉద్యమంలో చేరేలాగ, ఆయన్ని ఇంకాఇంకా ముందుకు లాక్కుపోతూ, కొత్త కోరికలతోనూ, కొత్త పదకాలతోనూ, మెల్లి మెల్లిగా ప్రత్యక్ష చర్యలకే దిగేలా చేశాడు జవహర్ - ఆయన, క్రమేణా శాసన సభలోని కాంగ్రెసుపార్టీనుంచి తప్పుకుని, దేశాన్ని స్వాతంత్ర్య సమరానికి సిద్దం చెయ్యలనే అభిలాషతో కుస్తీ పట్ట సాగా డన్నమాట!

నిజానికి యుద్ధ భూమిలో ఆయన ప్రతిభాశాలనే ఒప్పుకోవాలి. ఒక్కసారి ముందడుగువేసి దేనినయినా చేపడితే, ఆయన ముందుకు చొచ్చుకుని పోవడమే కాని, వెనుకంజవేసే బాపతు కాదు. పర్యవసానాలతో నిమిత్తం లేకుండా అల్లా ముందుకుపోతూ, దేశాన్నీ, ప్రజల్నీ కూడా ఇంకా ముందుకు లాక్కుపోయే రకం. దేశం అధైర్యంతో క్రుంగిపోతూన్న పరిస్థితిలో కూడా, దేశాన్ని ఉత్తేజ పరచి ముందుకు లాక్కుపోయే రకం ఆయన్ది. అదే ధైర్యమూ, అదే ఉత్సాహమూ ఆయన ఏకైక పుత్రుడయిన జవహర్‌లాల్‌కూ, జవహర్‌లాల్ ప్రేమాతిశయాలను చూరగొన్న ఇల్లాలు స్వర్గీయ కమలానెహ్రూకూ, జవహర్‌లాల్ సహోదరి విజయలక్ష్మీ పండిట్ కూ అలవడాయి.

ఈ కథనాన్ని కాస్త కట్టిపెట్టి, ఆ 1928 - 29 లలో మేము శాసన సభలో చేసిన, సాధించిన పనులను గురించి చర్చించడం న్యాయం. తిరిగీ సత్యాగ్రహం ఆరంభించేవరకూ మేము శాసన సభలో చేసిన పనులను గురించి చెప్పనివ్వండి.

హోదాలమీద పెద్ద నెహ్రూ మోజు

జనరల్ ఎన్నికలలో కాంగ్రెసువారు అఖండ విజయం సంపాదించి, శాసన సభలలో ప్రవేశిస్తూ, ఉత్సాహాన్ని చూపిస్తున్న ఆ రోజులలో - అంటే 1927 మార్చిలో - కాంగ్రెసు పార్టీ ప్రతినిధిగా మోతీలాల్‌గారిని ప్రభుత్వ ప్రజాప్రతినిధి సభ ఉపసంఘం (Empire Parliamentary Sub - committee)లో సభ్యునిగా ఎన్ను