పుట:Naajeevitayatrat021599mbp.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజని, బహిరంగ సమావేశంలో దాని కొక సవరణ ప్రతిపాదించారు. దానికి శ్రీనివాసయ్యంగారి మద్దతు లభించింది. ఇది గాంధీ - నెహ్రూ గార్లకు విషాద విస్మయ కారణం అయింది.

ఆ ప్రకారంగా అసెంబ్లీ పార్టీలోని నాయకునికీ, ఉప నాయకునికీ మధ్య ఒక రగడ బయల్దేరి, 1928 డిసెంబరు ఆఖరు దాకా అది సాగింది. మోతీలాల్‌నెహ్రూ గారికీ, శ్రీనివాసయ్యం గారికీ మధ్య ఇల్లా కాంగ్రెసు కార్యక్రమం నడిపే విషయంలో రగడ సాగుతూన్న రోజులలోనే, తన నిత్య విమర్శనలతో సి. ఎస్. రంగయ్యరు, మోతీలాల్‌నెహ్రూ గారిని విసిగిస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా మోతీలాల్‌గారికీ, లజపతిరాయిగారికీ మధ్యను కూడా రగడ బయల్దేరింది.

కాకలు తేరిన లజపతిరాయ్

అసెంబ్లీ మెంబర్లుగా ఉంటూ, విధానాలలో స్వల్ప భేదాలతో ఏవో కారాణాలవల్ల మోతీలాల్‌ గారికీ, అయ్యంగారికీ మధ్య అభిప్రాయ భేదాలొచ్చా యనుకోవచ్చుగాని, మోతీలాల్‌గారికి లజపతిరాయ్‌గారికీ మధ్య ఉత్పన్నమయిన విభేదాలకి కారణాలు దురూహం అనవలసి ఉంటుంది. లజపతిరాయ్‌గారు మోతీలాల్‌గారికి వ్యతిరేకంగా ఏ "స్వతంత్ర" పార్టీనీ స్థాపించ లేదు సరికదా, అధమం శ్రీనివాసయ్యంగారి 'స్వతంత్రపార్టీ'లో సభ్యత్వమయినా లేదు వారికి. మోతీలాల్‌గారితోగాని, మహాత్మా గాంధీగారితోగాని కలిసి పనిచెయ్యడానికి అనువయిందే లజపతిరాయ్‌గారి తత్వం. దేశస్వాతంత్ర్య సమరంలో పాల్గొనడంలోనూ, దానివల్ల బాధలకు గురి కావడంలోనూ ఆయన మోతీలాల్‌గారికన్నా, గాంధీగారికన్నా కూడా ఎక్కువ అనుభవం గడించినవాడు. ఆయన దేశ సేవా కార్యక్రమంలో జెయిలు శిక్షా, దేశ బహిష్కరణా కూడా అనుభవించిన దిట్ట. ఆ తర్వాతే గాంధీగారు 1921 లో శాసన ధిక్కారం వగైరాలు ప్రబోధించారు.

కాంగ్రెసు నూతన విదానాన్ని అవలంభించిన తర్వాతనే ఆయన కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గంలో మొదటి సభ్యుడయ్యాడు. ఆయన