పుట:Naajeevitayatrat021599mbp.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీగారి దన్ను చూసుకుని మోతీలాల్‌గారు తన్ను తాను సంబాళించు కోవలసిన స్థితిలోనే ఉన్నారు. కాని శ్రీనివాసయ్యంగారు తాను 1926 లో గౌహతి కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో, జవహర్‌లాల్ నెహ్రూగారినీ, సుభాస్ చంద్ర బోసుగారినీ అసరాగా తీసుకుని ముందడుగు వెయ్యసాగాడు. పరిస్థితులు ఇల్లా ఉంటూండగా, 1927 నాటికి కాంగ్రెస్ మదరాసులో సమావేశం కావడానికి పిలుపు వచ్చింది. ఆ పిలుపును మన్నించి అంగీకరించడమూ జరిగింది. కాగా 'స్వాతంత్ర్య' తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానం అటు గాంధీగారికి, ఇటు మోతీలాల్‌గారికి కూడా అయిష్టమయిందే. దాన్తో మోతీలాల్, శ్రీనివాసయ్యంగార్ల మధ్య రేగుతూన్న అభిప్రాయభేదాలు కాస్త తీవ్రరూపం దాల్చాయి.

కాంగ్రెస్ - లీగ్ స్కీము

సుభాస్ చంద్రబోసు 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని కాంక్షించిన వాడైనా, బెంగాల్ రాష్ట్రంవారు మాత్రం ఆ మదరాసు తీర్మానంతో అనుకోని విధంగా తబ్బిబ్బయారు. అందుచేత ఆ తీర్మానాన్ని కలకత్తా కాంగ్రెస్‌లో, అంటే 1928 లో, తిరగతోడాలని పదకం వేసుకున్నారు. వారివి తెలివయిన ఘటాలు. ఆ తీర్మానాన్ని తిరగ తోడడానికిగాని, నిర్వీర్యం చేయడానికిగాని మోతీలాల్‌నెహ్రూకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదని వారుగ్రహించారు. కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతీలాలే గనుక, ఆయనే ఆ పని చెయ్యడానికి అర్హుడని వారు తలచారు. గాంధీగారు ఒప్పుకోడంతో మోతీలాల్ అధ్యక్షుడయ్యాడు.

గాంధీగారూ, మోతీలాల్ కలసి మధ్యే మార్గంగా 'కాంగ్రెస్ - లీగ్ స్కీమ్‌' అంటూ ఒక దానిని లేవతీశారు. అదే అప్పట్లో కాంగ్రెసు వారి ధ్యేయం అన్నారు. "స్వాతంత్ర్య సముపార్జన విషయమై మాకెట్టి అభ్యంతరమూ లేదు.. దానిని గురించి అప్రమత్తతతో ప్రచారం చేసుకోండి" అన్నారు. సబ్జెక్ట్స్ కమిటీలో సుభాస్, జవహర్‌లాల్‌కూడా ఈ రాజీ సూచనకి ఒప్పుకున్నారు. కాని తరవాత అ ఒప్పందాన్ని త్రోసి