పుట:Naajeevitayatrat021599mbp.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలం నిర్ణయించుకుని, నేను అసెంబ్లీ బిల్డింగ్‌లో ఆనాటి కార్యక్రమాన్ని ముగించుకుని కూర్చున్న సమయంలో మోతీలాల్ నెహ్రూగార్ని నావద్దకు తీసుకువచ్చారు. వస్తూనే మోతీలాల్‌గారు పశ్చాత్తాపాన్ని కనబరిచారు. ఈ విషయంలో తన సానుభూతిని వెలిబుచ్చుతూ గాంధీ మహాత్ముడు తన పేర ఉత్తరం వ్రాశారని చెప్పారు. ఇటువంటి విషయాలలో ఆయన కా మూర్ఖపు పట్టూ, మొండితనమూ లేకపోతే ఆయన్ని సదా నా భుజస్కంధాలపైన మోస్తాను, ఆయన యందు నాకంత అభిమానమూ, గౌరవమూ ఉన్నా యన్నాను.

ఆ సమాచారం అంతటితో అల్లా చల్లారి పోయింది. ఈ విషయంలో ఓటమి నాదీ, గెలుపు మోతీలాల్‌గారిదీ అని ఒప్పుకోవడం న్యాయమేమో! ఆయన పార్లమెంట్‌లో అందరి సభ్యుల సమక్షంలో తన తప్పును ఒప్పుకోవలసిన పరిస్థితి తప్పిందిగా మరి! నాయకుడు తన తప్పును గ్రహించ గలిగాడు. నన్నూ ఎవ్వరూ ఎంత బలవంతం చేసినా ప్రతిపాదనకు వెనక్కు తీసుకునేలా చేయలేకపోయారని నేనూ సంతోషించాను.

4

పెద్దల మధ్య రగడలు

మోతీలాల్‌నెహ్రూగారికీ, శ్రీనివాసయ్యంగారికీ మధ్యను ఉన్న అభిప్రాయ భేదాలను గురించి కొద్దిగా ప్రస్తావిస్తాను. నెహ్రూగారితోగాని, శ్రీనివాసయ్యంగారితోగాని నా కెప్పుడూ ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయభేదాలూ లేవు. ఆ ఉభయులయందూ నాకు సమాన గౌరవ ప్రతిపత్తు లుండేవి. వారిరువురూ కూడా హృదయం విప్పి వారి కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవారు. అసలు వారిరువురి మధ్యా అభిప్రాయ బేదాలకుగాని, పరస్పర విరోధనికి అవకాశమే లేదు.

మహాత్మా గాంధీగారిలాగే మోతీలాల్‌గారూ మితవాదే. అవసరం అయితే కజ్జాకు కాలు దువ్వే రకమే. రాజీ ప్రతిపాదనలకూ