పుట:Naajeevitayatrat021599mbp.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రోజు" లన్నాడు. దాన్తో సభలోని ప్రతివ్యక్తికి ప్రాణంపోయి నంత పనయింది.

నిజానికి, సరుకుండి, అంకెలతోటీ, రుజువులతోటీ నిరూపిస్తూ మాటలాడగల యే వ్యక్తి అయినా తన ఉపన్యాసానికి మూడు రోజులు కాదు - వారంరోజులు తీసుకున్నా బాధలేదు కాని, ఏసభ్యుడయినా, తనకు తోచినంతసేపు మాటలాడ వచ్చును కాబట్టి, తన దగ్గిర సరుకున్నా లేకపోయినా, చెప్పిందే చర్విత చరణంగా చెపుతూన్నా, సందర్భాన్నీ ప్రస్తావన అంశాన్నీ తప్పించి మాట్లాడినా, అది అన్యాయమే కదా?

రంగయ్యరుకు మంచి వాగ్ధాటీ, భాషా పరిజ్ఞానమూ, వాదించగల నేర్పూ ఉండడంచేత ఎవ్వరికీ కూడా, ఎవ్వరి కేమిటి - ప్రెసిడెంటుగారికి కూడా, 'నీవు అనవసరపు ప్రస్తావన చేస్తున్నావు' అనడానికి సందు దొరకదన్నమాట! అందుచేత రంగయ్యరుకు కావలసినంత సావకాశం యిచ్చాడు. ఆంగ్లో ఇండియన్ గ్రూప్ లీడరయిన సర్ డార్సి లిండ్సే (Sir Darsy Lindsay) "ప్రెసిడెంటుగారు గమనించాలి! ఉపన్యాసం పరిధి దాటి దీర్ఘం, సుదీర్ఘం అయిపోతోంది" అని హెచ్చరిక చేసినా, రంగయ్యరు ఉపన్యాసాన్ని సాగనిచ్చాడు.

రంగయ్యరు అన్నంతపనీ చేశాడు. తన ఉపన్యాసం వినడానికి మనుష్యులు ఉన్నా, లేకపోయినా, ధోరణిలో తబ్బిబ్బు లేకుండా, ఆ మూడు రోజులపాటూ ఆ ఉపన్యాసాన్ని సాగించా డా ధీశాలి.

మేము కేంద్ర శాసన సభా సభ్యులంగా జీవితాన్ని గడపిన ఆ మూడు సంవత్సరాలలోనూ, ఈ మూడు రోజుల ఉపన్యాసకాలం చాలా సరదాగానూ, ఉత్సాహంగానూ, మరపురానిదిగానూ తయారయింది. ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్ గ్రూప్ నాయకుడు ఆ చర్చ సంబంధంగా మాటలాడుతూ, రంగయ్యరు గారు తన సుదీర్ఘ - కాదుకాదు - దీర్ఘ, అతి దీర్ఘ, మహాదీర్ఘ ఉపన్యాసంతో అనవసర కాలయాపన చేశాడని వాపోయాడు.

మోతీలాల్‌గారి పరిహాసం

అప్పటివరకూ అంతా సవ్యంగానే నడిచింది. కాంగ్రెసుపార్టీ నాయకుడుగా, మోతీలాల్ నెహ్రూగారు సమాధానం ఇవ్వడానికి లేచే