పుట:Naajeevitayatrat021599mbp.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనూ, ఆ పోలింగు బూత్ గుమ్మంవద్ద నిలిచి గవర్నమెంట్‌కు అనుకూలు రయినవారికి లోపలికి దారిచూపడంలోనూ బహు సమర్థుడు.

విఠల్‌భాయ్ పటేల్, వ్యక్తిగతంగా తన స్వభావాన్నిబట్టీ, తన హోదాను కాపాడు కుంటూ, తనకి ఉత్తమమని తోచిన రీతిగా న్యాయంగాను వ్యవహరిస్తూ, తన ఆఫీసుకు ప్రత్యేకస్థానం ఉండి తీరాలనీ, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్‌కూ, తనకూ సంబంధం ఉండకూడదనీ కోరడం సబబే అయినా, ప్రభుత్వరంగంలో మాత్రం ఆ కోరిక బాగా అలజడిని కలుగజేసింది.

హోం మెంబర్ క్షమాపణ

నిందాపూర్వకమయిన పోసుకోలు కబుర్లు లాబీ వర్గాలలోని అఫిషియల్ సభ్యులే ఆరంభించి, విఠల్‌భాయ్ పటేల్‌కు ఒక నిందను ఆపాదింపజేశారు. ఇల్లా చేసినందువల్ల తమ్ముతామే కించపరచుకుంటూ, సభ్యుల కోపతాపాలకు గురయాం. వారిమీద అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికికూడా సావకాశం ఉందన్న సంగతి పాపం, వారు తలచలేదు.

అసెంబ్లీ అధ్యక్షుడంటే సభ్యుల హక్కులను, అధికారాలను రక్షించే దాత అన్నమాట. విఠల్‌భాయ్, కాంగ్రెసువారు - కాంగ్రెసేతరులు, వారు - వీరు అన్న విభేదంలేకుండా అన్ని వర్గాలవారికీ అవసరమైన రక్షణ ఎప్పుడూ ఇచ్చేవాడు. ప్రభుత్వంవారి ట్రెజరీబెంచెస్ వారికికూడా రక్షణ ఇచ్చేవా డాయన. కాంగ్రెసు వారు అసెంబ్లీలో సుస్థిర స్థానం యేర్పాటు చేసుకున్నప్పటికీ, వారు ఎంతో దీమాగానూ, యుక్తియుక్తంగానూ పోట్లు పొడుస్తూన్నా ట్రెజరీబెంచి సభ్యులకు మాత్రం గర్వమూ, అహంభావమూ తగ్గలేదు.

ఈ అప్రతిష్ఠ పరిస్థితికి మార్గాంతరం మాకు కనబడక, ఆ ప్రకారం అధ్యక్షుని కించపరుస్తూన్న వారివద్దనుంచి క్షమార్పణ పుచ్చుకుతీరాలనే భావం మాకు ఏర్పడి, మా అధ్యక్షుని గౌరవ మర్యాదలు కాపాడవలసిన అవసరం మాదే గనుక, ఆ పార్టీ లీడర్ని తగు చర్య తీసుకోవలసిందని కోరాం. ఈ సమాచారం విషమ