పుట:Naajeevitayatrat021599mbp.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశాల ఆనవాయితీలను పాటిస్తూ, ప్రెసిడెంట్‌గా తనకున్న హక్కులను సవ్యంగా చెలాయిస్తూ, చాకచక్యంగా వ్యవహరిస్తూ, వైస్రాయ్‌గారూ, కౌన్సిల్‌ వారూ జారీచేసిన ఆర్డర్లనుకూడా అవసరమయితే ధిక్కరించి సభా గౌరవాన్ని కాపాడేవాడు.

శాసన సభలో పోలీసుగార్డ్ ప్రవేశించకుండా అటకాయించిన ధీరుడాయన. దేశంలో అమలులో ఉన్న రాజకీయసూత్రాల ప్రకారం అధ్యక్షుడికి ఎట్టి హక్కులూ ఉన్నట్లులేదు. ఒక నిష్పూచీ ప్రభుత్వమూ, ఏ పూచీలేని సభ్యులూ కలసి వారికి తోచిన విధంగా అధ్యక్షుని ఆడించగల స్థితిలో ఉన్నారన్నమాట! జెయిలులో ఉండగానే అసెంబ్లీకి ఎన్నికయిన ఎస్. ఎన్.మిత్రాగారికి శాసన సభా కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు సౌకర్యాలు కలిగించాలని కోరినప్పుడు, సర్ అలెగ్జాండర్ మడ్డిమన్ పార్లమెంట్ నాయకుడుగా ఉంటూ, సభ్యుల హక్కులపై నడిచిన తీవ్రమయిన వాగ్వివాదంలో కల్పించుకుని, సభవారికిగాని సభ్యులకుగాని ఎట్టి హక్కులూ లేవన్నాడు. విఠల్‌భాయ్ పటేల్‌గాక మరొక రెవరయినా అయితే, పోలీసువారు కౌన్సిల్‌లోకి రాకుండా అరికట్టగలిగి ఉండేవాడుకాడు. ఆ ప్రశ్నపైన ఆయన ఒక నూతన పద్ధతికి దారి చూపాడు.

ప్రెసిడెంట్ కార్యాలయ వివాదం

తర్వాత, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ నుంచి తన ఆపీసును ప్రత్యేకించి వేరుగా ఉంచి తీరా లన్నాడు. అవి కలిసి ఉండదాన్ని కొన్ని చిక్కు లున్నా యనీ, వాటిని విడిగానే ఉంచాలనీ, ఆయన వాదించాడు. దర్మిలా సర్ బిరుదాంకితు డయిన లాంసెట్‌గ్రాహం అప్పట్లో లెజిస్లేటివ్ డిపార్టుమెంట్‌కు కార్యదర్శిగా ఉండేవారు (ఆయన సింధురాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసి పించను పుచ్చు కున్నారు). పబ్లిక్ ఇన్పర్మేషన్ డైరెక్టర్ హోదాలో అపరాధ పరిశోధక డిపార్టుమెంట్‌కు ముఖ్యుడుగా కోట్‌మాస్ వ్యవహరించేవాడు. కాగా ఆయన గవర్నమెంట్ వారి చీఫ్ విప్‌కూడాను. ఓటింగుకాలంలో తన విధిని అతి జాగర్తగా నిర్వహిస్తూ, ప్రభుత్వ పక్షానికి కాన్వాస్ చేయడం