పుట:Naajeevitayatrat021599mbp.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తితో, కాంగ్రెసు నామాన్నే స్వీకరించి కౌన్సిల్‌లో కాంగ్రెసు పార్టీగా ఏర్పడిన పెద్దలు, వాదనలో దిట్టలనీ, నేర్పరులయిన ప్రజా ప్రతినిధులనీ, పై దేశాలలోని శాసన సభ్యులతో తులతూగగలవారనీ ఎంతపేరు సంపాదించినా, ఏ సహకార నిరాకరణ సూత్రాన్ని మనస్సులో ఉంచుకుని వ్యవహరిస్తామని హామీఇస్తూ శాసన సభా ప్రవేశం చేశారో - ఆ సూత్రాన్నే క్రమేపీ జారవిడుస్తూ వస్తున్నారా అనే అనుమానానికి గురయ్యారు.

అందువల్లనే అఖిల భారత కాంగ్రెసు సంఘ సభ్యుడయిన తెన్నేటి విశ్వనాధం గారు కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో శాసన సభాసభ్యుడయిన ఏ కాంగ్రెసువాదీ ప్రభుత్వం వారు సూచించే ఏ హోదానీ చేపట్టరాదనీ, ఈ ద్వంద్వ ప్రభుత్వంలో మంత్రిపదవి లభించినా తిరస్కరిం చాలనీ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించవలసి వచ్చింది. ఈ ప్రతిపాదనతో నాయకులు ఇరకాటంలో పడ్డారు. అందుచేత విశ్వనాథంగారి ప్రతిపాదనను కాంగ్రెసు అధ్యక్షులవారే స్వయంగా వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

కాని అప్పటికే కాంగ్రెస్ ప్రారంభ దినం దగ్గిరయింది. శ్రీనివాసయ్యంగారు అప్పుడు కాంగ్రెసు అధ్యక్షుడు. దాస్, నెహ్రూగారలు స్వరాజ్యపార్టీని ఏర్పరచిన దరిమిలానే ఆయన కాంగ్రెసులో చేరాడు.

కాంగ్రెసువారు తా మవలంబించిన కౌన్సిల్ ప్రోగ్రాం ఎప్పుడయినా వదిలే స్తారనిగాని, నేరుగా సహకారనిరాకరణం, శాసనధిక్కారం లాంటివి చేపట్టి ప్రత్యక్ష చర్యకు దిగుతారనిగాని ఆయన ఎప్పుడూ ఊహించలేదు.

శాంతియుతంగా శాసన సభా కార్యక్రమం నడపడమే ఆయన వాంఛితార్థం. ఆయన ఒక సమగ్రమయిన పదకాన్ని వేసి, తద్వారా కౌన్సిల్లో ఐకమత్యం నెలకొల్పి తంటాలుపడదాం అని ఎంతో శ్రమపడ్డాడు. తానే కాంగ్రెసు అధ్యక్షుడున్నూ, తానే ఆ పదకపు నాయకుడూ అవడాన్ని తన పదకం చులాగ్గా అంగీకరించ బడుతుందని తలచాడు. ఆ పదకం అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు ఒప్పుకున్నారు. కాని