పుట:Naajeevitayatrat021599mbp.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్ముడు. కాని నిజానికి ఆయనకి ఎప్పుడయినా చిక్కులు వస్తే అవి తానే స్వయంకృతాపరాధంగా ఎంచుకున్న ఆ పెద్ద నాయకుల ద్వారానే వచ్చేవి. చిత్తరంజన్‌దాస్, మోతిలాల్ నెహ్రూ, మహమ్మదాలీ, షౌకతాలీలాంటి, అగ్ర నాయకులయిన నమ్మినబంట్లే ఆయన్ని చికాకుల్లో ముంచారు.

ఆయనకున్న బలం ఆయన సరిగా విలియా వేసుకోలేక పోయారు. భారత దేశంలో ఉన్న కోటానుకోట్లజనం, స్వాతంత్ర్యంకోసం తహతహలాడుతూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన సూచించిన అహింసాతత్వాన్ని జీర్ణించుకుని, ఎటువంటి త్యాగాలకయినా సిద్ధంగా ఉండగా, ఆయనమాత్రం తన అనుంగు అనుచరులని, తాను నమ్మినవారిని అంటిపెట్టుకుని ఉన్నాడు. వారిలో కేంద్రంవారూ, రాష్ట్రాలవారూ ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారిలో చాలా మంది గాంధీగారిలోనూ ఆయన కార్యక్రమాలలోనూ, తుదకు ఆయన విధానం లోనూ కూడా విశ్వాసం లేనివారే అయ్యారు.

అటువంటి వారిని నమ్మి, వారిపై ఆధారపడడమే ఆయన చేసిన పెద్ద తప్పిదం అనవలసివస్తుంది. పాపం, వారివల్లనే కదా ఆయన ఇక్కట్ల పాలయింది? తన మనుష్యులని తాను నమ్మిన పదిహేనుమందిలో పదిమంది మంచి క్లిష్ట పరిస్థితులలో, ఆయన విధానా లన్నింటికీ మూలకందమూ, ముఖ్యాతి ముఖ్యమూ అయిన అహింసావిధానం విషయంలోనే, ఆయన్ని జారవిడిచి ద్రోహం చేశారు. ఈ విషయం ప్రత్యేకంగా పూర్తి వివరాలతో, "శ్రీ గాంధీగారి నాయకత్వమూ, జాతీయోద్యమమూ - ఇటీవల జరిగిన సంఘటనలూ" అన్న శీర్షిక క్రింద ఆ కథంతా సావకాశంగా ఏకరువు పెడతా.

విశ్వనాథంగారి ప్రతిపాదన

కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనుకూడా సహకార నిరాకరణే ప్రాతిపదికగా ఎన్నికయిన కాంగ్రెసువారు స్వరాజ్యపార్టీ సభ్యులుగా చెలామణీ అవుతూ, దరిమిలా కాంగ్రెసును కోరి, కాంగ్రెసు అనుమ