పుట:Naajeevitayatrat021599mbp.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిబంధకాలై, వారి కాళ్ళూ చేతులూ అనుకోని విధంగా బిగించేశాయి. భారతదేశ విషయంలో వారు ఏమీ చేయలేని స్థితిలోనికి వచ్చారన్న మాట! ఎలాగో ఒకలాగ లేబర్‌పార్టీవారు భారతదేశానికి ఏదయినా సహాయం చేసి పోతారేమోననే దుగ్ధతోనే కదా,కన్సర్వేటివ్‌లు ప్రజాభిప్రాయానికి భిన్నంగా, ప్రజలు కనబరచిన నిరసన లన్నింటినీ సహించి తంటాలుపడింది!

భారత నాయకత్వం బహునాయకత్వమూ, బాల నాయకత్వము అయి పప్పులో కాలువేసింది. వచ్చేవారు లేబర్‌పార్టీ వారయినా, లిబరల్ పార్టీ వారయినా, కన్సర్వేటివ్‌లే అయినా, ఇచ్చేవారు మాత్రం ఇంగ్లీషు వారేననీ; ఇండియాకు సంబంధించినంతవరకూ, ఏ పార్టీవారయినా చూపించేది తొంటి చెయ్యేననీ; ఇంగ్లీషువారెప్పుడూ, తమ ప్రత్యర్థి బలా బలాల విలువలు విలియా వేసుకుని, వాడు బలవంతుడయితేనే తప్ప కాళ్ళబేరానికి రారనీ, పాపం, భారత నాయకులు గ్రహించలేదు. భారతీయ నాయకు లరచిన ఆ అరపుల లోని బీదతనాన్నీ, అర్భకత్వాన్నీ, అది కావా లిదికావా లనే యాచక మనసత్వాన్నీ ఆంగ్లేయు డెప్పుడూ మన్నించి గౌరవించలేడు. భారతీయ మనస్తత్వం ఆంగ్లేయులకు బాగా అర్థమయిన కారణంగానే, చాకచక్యంగా వాయిదాలమీద వాయిదాలు వేసుకుంటూ దాటుకు రాగలిగారు.

గాంధీజీ నమ్మినబంట్ల వరస

భారతీయులందరూ, గాంధీగారియందు సంపూర్ణ విశ్వాసం గలవారై, ఆయన తెలిసిగాని తెలియకగాని పొరపాటునగాని గ్రహపాటునగాని, మరో ఉద్దేశంతో గాని యీ దేశానికి ఏ విధమయిన చెడుగూ ఎప్పుడూ చేయలేదని, ఆనాడే గాదు - ఈ నాడూకూడా నిస్సంకోచంగా నమ్ముతారు. గాంధీగారు, ఎప్పుడయినా ఏదయినా పొరపాటు చేసిఉంటే, తాను చేసిన పొరపాటును గ్రహించిన తక్షణం, బహిరంగంగానూ, నిస్సంకోచంగానూ ఒప్పుకుని, ప్రజాభిప్రాయమే తన అభిప్రాయంగా మార్చుకుని, దేశక్షేమాన్నే సర్వత్రా కాంక్షించిన మహా