పుట:Naajeevitayatrat021599mbp.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందులో డా॥ అన్సారీ అధ్యక్షతను నడచిన ఒక మీటింగులో, ఒక క్రమమయిన, యుక్తి యుక్తమయిన రాజ్యాంగ పథకాన్ని (Constitutional scheme) తయారు చెయ్యడానికి "నెహ్రూ కమిటీ" అన్న పేరుతో ఒక ఉప సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ నెహ్రూ కమిటీవారు తమ నివేదిక జూన్ 1928 నాటికి తయారుచేసి సమర్పించాలని నిర్ణయించారు. ఈ లోపుగా సైమన్ కమిషన్‌వారు రావడమూ, పర్యటించడమూ, తిరిగి వెళ్ళడమూ, తిరిగీ 1929 లో వస్తామని చెప్పడమూ జరిగాయి. నెహ్రూ కమిటీవారి రిపోర్టు ఏమయిందీ మున్ముందు చెపుతాను.

ఇండియన్ కమిటీ

1927 నాటి ఇతర విషయాలను గురించి చెప్పేలోపల, సైమన్ కమిషన్‌ని గురించి విశదీకరించడం న్యాయం

మోతీలాల్ నెహ్రూగారి సవరణతో వెనక్కి నెట్టబడిన లాలా లజపతిరాయ్‌గారి 'బహిష్కరణ' తీర్మానము, కాంగ్రెసుపార్టీ నాయకుడు రాయల్ కమీషన్ ఏర్పాట్లలో తికమకలున్నాయంటూ చేసిన నిర్వచనమూ మొత్తానికి నేల విడచి సామయిన కారణంగా, వైస్రాయ్, తాను ఎన్నుకోమంటే కాంగ్రెసు పార్టీవారు ఎన్నుకోలేదని నెపంవేస్తూ, తన చెప్పు చేతులలో ఉండే నలుగురు అసెంబ్లీ మెంబర్లను ఎంచి, వారికి ఇంకో ముగ్గుర్ని జతగూర్చి, భారతీయ సహకార సంఘం (Indian Committee of Assessors) అంటూ ఏర్పరచి, ఆ సంఘం రాయల్ కమిషన్‌తో సహకరిస్తుందన్నాడు.

వైస్రాయ్ సవాలు

బొంబాయిలో కమిషన్‌వారు అడుగుపెట్టే లోపల ఎల్లాగయినా వారికి సహకారం సంపాదించి తీరాలని వైస్రాయ్ చాలా తాపత్రయపడ్డారు. ఫిబ్రవరి 2 వ తేదీని, అంటే తెల్లవారితే కమిషన్‌వారు కాలు పెడతారనగా, తాను ఎన్ని విధాల ప్రయత్నించినా సహకారం రాని కారణంగా, సహకారం ఉన్నా లేకపోయినా కమిషన్‌వారు తమ