పుట:Naajeevitayatrat021599mbp.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్తరపాట్లూ, గాబరాలూ

ఉభయత్రా తత్తరపాట్లూ, గాబరాలూ, అల్లకల్లోల పరిస్థితే సంభవించింది ఈ కమిషన్ నియామకంవల్ల. దానిని ఏర్పరచిన బ్రిటిషు వారు ఇండియా పరిస్థితి, కాంగ్రెసు నాయకుల స్థితిగతులూ గ్రహించకుండా ఎల్లా తొందర తొందరగా వ్యవహరించారో, అదే విధంగా కాంగ్రెసు నాయకులూ చిందర వందర పరిస్థితి లోనే ఉన్నారు. కాంగ్రెసు బహిరంగ సమావేశాలలో ప్రజల తరపునా, అఖిల పక్ష రాజకీయ పక్షాల తరపునా 1928 ఫిబ్రవరి - మార్చి రోజులలో రూపొందించిన కోరికను చెల్లించవలసిందిగా గట్టిగా అడగ గల శక్తి, ధైర్యమూ కాంగ్రెసు వారికి లేకపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఆ సైమన్ కమిషన్ వారికి చుక్క ఎదురవుతూ వచ్చిన ఆ రోజులలో, కాంగ్రెసువారికి ఆ విషయమై ఆసక్తి లోపించింది.

అఖిల పక్ష నాయకుల కోరిక, నిజానికి, అతి ముఖ్యమయిందీ, వాంఛింప తగ్గదీని. అన్ని విధాల పూర్తిగా పూచీ వహించగల ప్రభుత్నాన్నే (Full responsible government) భారతదేశంలో వెంటనే స్థాపించి తీరాలని ఏకగ్రీవంగా నూ, స్పష్టంగానూ, ఆ అఖిలపక్ష రాజకీయ సభవారు (All parties' Conference) కోరిన కోర్కెకంటే, మిన్న అయింది ఇంకొకటి ఉండబోదు కదా! 1927 డిసెంబరులో కాంగ్రెసువారు ఆమోదించిన స్వాతంత్ర్య తీర్మానానికీ, 1928 ఫిబ్రవరి - మార్చి రోజులలో ఈ అఖిల పక్ష నాయకులు కోరిన కోరికకీ భేదం లేదనే అనాలి.


1928 లో అర్ద సంవత్సరంపాటు మాకు ఉత్తర హిందూస్థానంలోనే గడిచి పోయింది. ఆల్‌పార్టీ కాన్పరెన్సులూ, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారి మీటింగులూ అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా అ ఉత్తర హిందూస్థానంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ అఖిల పక్ష సభవారే 1928 ఫిబ్రవరి - మార్చి మాసాలలో 25 సార్లు కలుసుకున్నట్లు రికార్డుంది.