పుట:Naajeevitayatrat021599mbp.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడనుంచి జార్జిటౌనుకు వెడదామని తలచాను. నేను ఫ్లవర్‌బజారు వీదికి వచ్చేసరికి, నా కారు ఆపుజేశారు. అక్కడ కారు వదలి కాలినడకన హైకోర్టువైపు బయల్దేరాను.

హైకోర్టు దగ్గర యేవో కొన్ని గడబిడలు జరుగుతున్నాయని విన్నాను. ఈ రస్తాలన్ని యిల్లా మూసివేయడానికి కారణం, చేరుతూన్న గుంపులలోని కొందరు దుండగీండ్లు బ్రాడ్వేలో కొన్ని దుకాణాల కిటికీ అద్దాలు పగలగొట్టడం. హైకోర్టు ఆవరణలో ఉన్న ఒక సొలిసిటరుగారి కారుకు నిప్పంటించడంతో పరిస్థితులు కాస్త విషమించాయి. చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ పండాలేగారు అక్కడకు వచ్చి, ఆయనకున్న శక్తినంతా కూడదీసుకుని, శాంతిని నెలకొల్ప డానికి ప్రయత్నించాడు. నేను నడచి వెడుతూంటె యీ సంగతులన్నీ నాకు వివరించ బడ్డాయి. కేవలం పోలీసు రిపోర్టు ఆధారంగా ఆయా ప్రదేశాలను చూడకుండానే కాల్పులు జరగడానికి అనుమతులు ఇవ్వబడడమూ, మంచి చెడుగులు విచారించకుండా కాల్పులు జరపడమూ కూడా జరిగింది.

ఈ గడబిడలు జరిగిన కొన్ని గంటల తర్వాత, బ్రాడ్వేలోనూ, హైకోర్టు ఎదుట ఎస్ల్పనేడులోనూ గుంపులు గుంపులుగా జనం వెడుతూంటే, అ చివర - మిల్లరు విగ్రహం దరిదాపులలో, కాల్పులు జరపడానికి చీప్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్ ఆర్డరు జారీ చేశాడు. ఆయన కూడా తనంటత తానుగా గాక, ఒక యూరోపియన్ హైకోర్టు జడ్జీగారి సలహా ననుసరించి కాల్పులకు అనుజ్ఞ యిచ్చాడు. ఆయన ఆ కాంపౌండ్ చివరకు వచ్చి గుంపులను చెదరగొట్టే నిమిత్తం కాల్పులు సాగించ వలసినదని పండాలేగారికి సలహా యిచ్చాడట! అదృష్టవశాత్తూ అక్కడికక్కడే ఎవ్వరూ మరణించలేదు.

గుండెకు బారుచేసిన తుపాకి

పారీస్ కార్నర్ దగ్గిర మాత్రం రోడ్డుకు మధ్యగా ఒక స్థూలకాయుడు చచ్చిపడిపోయాడు. అప్పుడు గుంపులన్నీ చెదిరిపోయాయి. ఆ కూడలి దగ్గరి బీచికి వెళ్లే రస్తా, కష్టమ్ హౌసుకు వెళ్ళేదారీ, ఆర్మీనియన్ వీధినుంచి హైకోర్టుకు వెళ్ళేదారి. అన్నీ పోలీస్ కార్డన్‌తో