పుట:Naajeevitayatrat021599mbp.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలుసుకొని, సైమన్ కమిషన్‌వారు మద్రాసు చేరే రోజున పూర్తి హర్తాలు జరపాలని నిశ్చయించారు.

తర్వాత మద్రాసు ప్రభుర్వంవారు (సియార్. పి. సి.) 144 సెక్షన్ కింద మీటింగులూ, ఊరేగింపులూ మొదలైన ఏ విధమయిన కార్యక్రమాలలోనూ కాంగ్రెసువారు పాల్గొన రాదంటూ ఆంక్ష విధించారు. ఈ వార్త తెలిపిన వెంటనే తిరిగి కాంగ్రెసు పెద్దలు కలుసుకొని శ్రీనివాసయ్యంగారూ, నేనూ సకాలంలో మదరాసు చేరుకుని, 144 సెక్షన్ ధిక్కరించి, 'బాయ్‌కాట్‌' విజయవంతంగా సాగించాలని తీర్మానించారు.

అయ్యంగారి వెనుకంజ

నేను, మదరాసు వెళ్ళడానికి అవసరమైన సన్నాహాలన్నీ చేసుకుని, శ్రీనివాసయ్యంగారితో కలిసి బయలు దేరడానికి సిద్ధమయాను. శ్రీనివాసయ్యంగారూ, నేనూ అనుదినమూ కలుసుకుంటూనే ఉన్నాం. ఉభయులమూ కలిసి వెళ్దామని అనుదినమూ అనుకుంటూనే ఉన్నాం. కాని, ఆఖరు క్షణం వరకూ, ఆయన, తాను రావడం లేదనీ, తన భార్య అనుదినమూ పట్నం రావద్దనీ, బాయ్‌కాట్ సందర్భంగా అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ టెలిగ్రాములు ఇస్తున్నదనీ, నాతో చెప్పలేదు. ఆ రోజున మేము ఉభయులమూ కలిసి బయల్దేరవలసిందే. టెలిగ్రాముల కారణంగా తాను రావడం లేదని ఆయన అనడంచేత, ఆ సంగతి మోతీలాల్‌గారితో చెప్పి, నేను ఒంటరిగానే బయల్దేరాను.

అపూర్వ తీర్మానం

నేను కలకత్తా చేరేసరికి, కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గంవారు, తిరిగీ అర్జంటుగా కలుసుకుని, చెన్నపట్టంలో చేద్దామనుకున్న హర్తాలు, వగైరా జరుపకూడదని తీర్మానించారు. అఖిల భారత కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహకవర్గంవారు చేసిన అపూర్వ తీర్మానం అది. మదరాసు కాంగ్రెసు ఆదేశానుసారంగా హర్తాలు జరిపించడానికి నేను సగం