పుట:Naajeevitayatrat021599mbp.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తక్షణం శ్రీనివాసయ్యంగారు నిశ్శబ్దంగా ఆ ఆజ్ఞను పాటిస్తూ వెనక్కి తిరిగారు.

చెప్పానుగా - మొదటి శ్రేణిలో శ్రీనివాసయ్యంగారూ, వారి వాలంటీర్లూ నడవగా, ద్వితీయ శ్రేణిలో నేనూ, నా అనుచరులూ ఉన్నాం అని. అటకాయింపులూ, వెనుదిరగడాలూ అయ్యాక, ఆ సముద్ర తీరానికివెళ్ళి, అక్కడ సావకాశంగా ఇసుకలో మీటింగు పెట్టుకున్నాం. ఆ సభలో, పోలీసువారు ఊరేగింపును ఆ ప్రకారం నడి రోడ్డుమీద నిలుపు చెయ్యడం అన్యాయమనీ, ఇంకోసా రెప్పుడయినా ఊరేగింపులను అటకాయించడం జరిగితే, పోలీసు కార్డన్‌ని కాదని ముందుకు నడుస్తాం అనీ నేను ప్రకటించాను. మాలో ఒక వెయ్యిమందికి పైగా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నాం. అటువంటి అరెస్టులే జరిగి ఉంటే - ఆ వచ్చినవారికి ఎంతో కనువి ప్పయ్యేది. కాని అలా జరగడానికి వీలులేని పరిస్థితి అయింది.

పూర్తి హర్తాలు

ఏమయితేనేం, కమిషన్‌వారు పట్నంలో మొదటిసారిగా అడుగుపెట్టిననాడు జరిగిన బహిష్కరణ జయప్రదంగా జరిగిందని ఒప్పుకోక తప్పదు. పట్నంలో హర్తాలు సంపూర్ణంగానూ, సమగ్రంగానూ, బ్రహ్మాండంగానూ సాగింది. కమిషన్‌వారు ఎక్కడకి వెళ్ళినా నల్ల జెండాలే ఎదురయ్యాయి. ఒక్కొక్క చోట అమిత ఉత్సాహం గల యువకులు నల్ల జెండాలను నడుస్తూన్న సర్ జాన్‌సైమన్‌గారి కారులోకే విసిరి వేశారు.

సైమన్ కమిషన్ మదరాసుకు రానై ఉంది. ఫలానా రోజుకు వారు వస్తున్నారు అని తేదీ కూడా నిర్ణయం అయింది. సెంట్రల్ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ నడుస్తోంది. అప్పట్లో నేనూ, శ్రీనివాసయ్యం గారూ కూడా అసెంబ్లీ పనిలోనే నిమగ్నులమై ఉన్నాం. ఎప్పుడయితే తారీఖు నిశ్చయమై, ప్రకటింపబడిందో ఆ తక్షణం మోతీలాల్ నెహ్రూగారి ఆధిపత్యాన అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు డిల్లీలో