పుట:Naajeevitayatrat021599mbp.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రదంగా నడిపించాలనే ఉత్సాహంతో దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు గుంటూరునుంచి వచ్చి, 'బాయ్‌కాట్‌' పూర్తిగా విజయవంతం చేయడానికి ఎంతో తోడ్పడ్డారు.

అపురూప దృశ్యం

సైమన్ కమిషన్‌వారు బొంబాయిలో 1923 ఫిబ్రవరి 3 వ తేదీని ఓడ దిగారు. ఆ రోజున, శ్రీనివాసయ్యంగారూ, నేనూ ఇతర ప్రముఖులతో కలిసి ఊరేగింపులు సాగించాం.[1] చెన్నపట్న వాసులు ఎప్పుడూ చూడని అపురూప దృశ్యం అది. శ్రీనివాసయ్యంగారూ, ఆయన అనుచరులయిన స్వచ్ఛంద సేవకులూ మొదటి శ్రేణిలో ముందు నడుస్తూ ఉంటే, నేనూ - నా అనుచరులూ ద్వితీయ శ్రేణిలో నడుస్తున్నాం. ఊరేగింపు జార్జిటౌన్‌లో ఆరంభించబడింది. అక్కడనుంచి మౌంట్‌రోడ్డు గుండా, మెరీనా బీచికి చేరే పర్యంతం అంతదూరమూ నడిచే వచ్చాం.

అక్కడ పోలీస్ కమిషనర్ సి. జె. కన్నింగుహామ్ మమ్మల్ని అటకాయించాడు. పెద్ద పోలీసు బలగంతో మమ్మల్ని చుట్టుముట్టి, రోడ్డంతా ఆక్రమించాడు. నిజానికి మేము చులాగ్గా అ పోలీసు కార్డన్‌ని కాదని తప్పించుకుని ముందడుగు వేయవలసిన పరిస్థితే అయినప్పటికీ అటువంటి ఉద్రిక్త పరిస్థితులలో కార్డన్‌ని లెక్కచెయ్యకుండా ముందడుగు వేయవలసిందనే ఆదేశం కాంగ్రెసు ఇచ్చి ఉండలేదు. అందుకని కాస్త తటపటాయించాం.

శ్రీనివాసయ్యంగారు అటువంటి పరిస్థితులకు అలవాటు పడిఉండలేదు. కన్నింగహామ్ వెనక్కి తిరగమని చేతితో సంజ్ఞ చేసిన

  1. 1929 లో సైమన్ కమిషన్ రెండవతూరి మదరాసు వచ్చినప్పుడు ఈ సంఘటనలు జరిగినట్టుగా కీ. శే. వావిళ్ల వేంకటేశ్వరులుగారి "ప్రకాశము పంతులుగారి జీవితము" (పే - 99) లో చెప్పబడింది.