పుట:Naajeevitayatrat021599mbp.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

తిరిగిపో, సైమన్!

సైమన్ కమిషన్ బహిష్కరణ సంఘటనల గురించి చదువరులకు పరిపూర్ణమయిన అభిప్రాయం కలగడం కోసము, జరిగింది యథాతథంగా తెలియడం కోసము, దక్షిణా పథానికి చెందిన ఆంధ్రులూ, తమిళులూ, మలయాళీలూ, కన్నడిగులూ ఆ ఉద్యమంలో ఎల్లా ఎల్లా తమ తమ పాత్రలు నిర్వహించారో వివరంగా చెప్పి మరీ యీ కమిషన్ కథను సాంతం చెయ్యాలని ఉంది.

దక్షిణ దేశానికి సంబంధించి నంతవరకూ ఈ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో నేనూ, చెన్నపట్టణంలోనూ - దక్షిణాదిన నా మిత్రుడు సర్గీయ శ్రీనివాసయ్యంగారూ నాయకత్వం వహించి నడిపించాము. నా నాయకత్వాన నడుస్తూన్న ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ వారికీ, శ్రీనివాసయ్యంగారి నాయకత్వాన నడుస్తూన్న తమిళనాడు కాంగ్రెసు కమిటీ వారికి మధ్యని ఎటువంటి స్ఫర్థలూ లేవు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప, పరస్పరం సంప్రతించుకునే, పరస్పర సహకారంతోనే, ఉద్యమం సాగించాలన్నదే మా వాంఛ. ఆ ప్రత్యేక పరిస్థితులన్నవి ఉభయ భాషల వారికీ ఉండుకున్న ప్రత్యేక గుణగణాలకు సంబంధించిన సున్నితమయిన సమస్యలన్నమాట.

నల్లజెండాలు

సైమన్ కమీషన్‌వారు మొదటిసారిగా[1] పట్నం వచ్చిన సందర్బంలో వారికి నల్ల జెండాలతో స్వాగతం ఇవ్వబడింది. ఇటువైపు తిరిగినా, ఏ మూల చూసినా నల్ల జెండాలే ఎదురయ్యాయి. ఆనాటి కార్యక్రమంలో ఇతర నాయకులతో కలిపి పాల్గొని ఉద్యమాన్ని జయ

  1. 1928 ఫిబ్రవరి ఆఖరి వారంలో.