పుట:Naajeevitayatrat021599mbp.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుల కోర్కెలను మన్నించే సదుద్దేశంతోనే బ్రిటిషువారు కమిషన్ని నిర్ణయించారు గావున, అ కమిషను వారిని కలుసుకుని సంప్రతించడం దేశీయుల క్షేమ లాభాలకేననీ సూచించారు. వైస్రాయిగారి విన్నపాలన్నీ బుట్టదాఖలయ్యాయి.

'విభీషణాయిలు'

కాని ప్రతి దేశంలోనూ కొంతమంది విభీషణాయి లుంటూ ఉంటారుకదా! ఆ విభీషణాయిలు తమ దేశాన్ని మట్టుపెట్టడానికి ఎప్పుడూ రెడియే. అలాంటి వారు కొందరు కమిషన్ వారిని కలిశారు. తదితరులెవ్వరూ వారి ముఖం చూడలేదు.

డా॥అన్సారీగారి అధ్యక్షతను 1927 డిసెంబర్ ఆఖరి రోజులలో మదరాసులో కాంగ్రెసు మహాసభ జరిగినప్పుడు, సైమన్ కమిషన్ని బాయ్‌కాట్ చేయవలసిందన్న తీర్మానం ఆమోదించబడింది. కమిషన్ వారికి ఎలాంటి సహకారమూ ఇవ్వరాదనీ, వారి విచారణ సందర్భంలో వారికెలాంటి సమాచారమూ అందజేయరాదనే దేశవ్యాప్తంగానూ, విశదంగానూ కాంగ్రెసు సంస్థ లన్నిటికీ, ప్రజానీకానికీ కాంగ్రెసువారు విజ్ఞప్తులు చేశారు. కమిషన్‌వారు బొంబాయిరేవులో దిగిననాడే దేశ వ్యాప్తంగా హర్తాల్ జరపాలనీ, వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా వారిరాకపట్ల అసమ్మతి సూచకంగా ఆ ప్రాంతీయులు తగు ప్రదర్శనలు జరపాలనీ, దేశవ్యాప్తంగా సూచనలు ఇవ్వబడ్డాయి. అసెంబ్లీ మెంబర్ల కందరికీ, కమీషన్‌వారికి ఏ విధమైన సహకారాన్నీ అందజేయరాదంటూ ఆదేశాలు వెళ్ళాయి. వీలయినప్పుడల్లా, వీలయిన విధంగా, వారి రాకపట్ల అసమ్మతి ప్రకటించాలని కూడా సూచనలు ఇవ్వబడ్డాయి.

బ్రిటిషువారి ఆశ

సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కూ, బ్రిటిషు క్యాబినెట్ వారికీ, గవర్నర్లకూ కూడా ప్రజాహృదయం పూర్తిగా తెలిసే ఉంది. వారందరూ 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఏవిధంగా బహిష్కరించబడ్డాడో ఎరిగే ఉన్నా,