పుట:Naajeevitayatrat021599mbp.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైస్రాయిగారి విన్నపాలు

కాని ఆయనా, సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ బర్కెన్ హెడ్డూ సైమన్ కమిషన్ వారి యాత్ర సుగమం చేసి తీరాలనే పట్టుదలమీద ఉన్నారు. డిసెంబరు 27 న కాంగ్రెస్‌వారు సైమన్ కమిషన్ 'బాయ్‌కాట్' తీర్మానం ప్యాసు చేయడం కోసమే మద్రాసులో కలుస్తున్నారన్న సంగతి ఎరిగిఉన్న ఇర్విన్ ప్రభువు నవంబర్ మొదటి వారంలో కొన్ని ముఖ్యమైన విషయాలమీద భారతీయ నాయకులందరితోటీ సంప్రదించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ తెలియపరిచారు. అప్పట్లో సెంట్రల్ అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతున్నాయి. అసెంబ్లీ నడుస్తోందన్నమాట! ఈ పిలుపు సెంట్రల్ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరికీ అందజేయబడింది. సైమన్ కమిషన్ విషయంలో సహకారం అర్థించడం కోసమే ఈ పిలుపు వచ్చిందన్న సంగతి అందరూ ఎరిగినదే. కాంగ్రెసువారు వైస్రాయ్‌గారి పిలుపును మన్నించి, వారితో సంప్రతించడానికి ఎప్పుడూ సన్నద్ధులుగా లేరు. కాని గాంధీగారు ఆయన్ని కలుసుకుని తన మనోగత అభిప్రాయాన్ని సువ్యక్తం చేశారు.

ఇది జరిగాక కూడా వైస్రాయ్‌గారు నాయకులనీ, ప్రజలను కూడా రాయల్ కమిషన్ వారి సంచార కార్యక్రమంతో సహకరించమని కోరుతూ ఒక విన్నపాన్ని ప్రకటించాడు. ఒక్క దేశీయుడికి కూడా అందులో సాధనం లేని ఆ కమిషన్ దేశవ్యాప్తంగా బహిష్కరించబడింది.

వైస్రాయ్‌గారు ఇంకో విన్నపాన్ని ప్రకటించాడు. ప్రజలచేత ఎన్నుకొనబడి సెంట్రల్ అసెంబ్లీలోనూ, రాష్ట్ర అసెంబ్లీలలోనూ రాష్ట్ర అసెంబ్లీలలోను ఉంటున్న నాయకులు చెప్పింది ప్రజాభిప్రాయంగా స్వీకరించి, దానిని పరిశీలించి, వారి సదభిప్రాయాలను మన్నించి, ఉభయ దేశాల మధ్యా సుహృద్భావం పెంపొందిస్తూ దేశీ