పుట:Naajeevitayatrat021599mbp.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలో సైమస్ కమిషన్ వారవలంబింపవలసిన విధానమూ, పద్ధతీ, మొదలైనవి ఏవీ రాయల్ కమిషన్ వారు నిర్ణయించలేదని ఒప్పుకున్నారు. అంతేకాదు, ఎలక్టయిన కేంద్ర శాసన సభ్యులూ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వారూ కలసి ఒక జాయింట్ కమిటీగా ఏర్పడి, ఆ రాయల్ కమిషన్ వారితోపాటు ప్రయాణం చేసి సాక్ష్యాన్ని సేకరించి, సైమన్ కమిషన్ వారి పరిశీలన నిమిత్తమో, సూచన ప్రాయమైన సలహాగానో, వారు యే దృష్టితో స్వీకరించినా తమ అభిప్రాయాన్ని మాత్రం అందజేయడానికి తావుందని వైస్రాయిగారు ఒప్పుకున్నారు.

లార్డ్ ఇర్వినూ, ఆంగ్ల రాజ్య తంత్రజ్ఞులూ కూడా తాము తప్పేచేశామని ఒప్పుకున్నారు. కాని ఇవి యేవీ కూడా భారత నాయకులకు సంతృప్తిని కలుగచేయలేదు. వేయబోయే ఇండియన్ సబ్ కమిటీ వారు కేవలం ఎసెస్సర్లయి, బొమ్మలలాగ జరుగుతూన్న కర్మకాండను వీక్షిస్తూ ఉంటారన్న మాట. వీరి అభిప్రాయంతో వారికి ఎటువంటి సంబంధమూ ఉండకపోవచ్చునంటే పరిస్థితి ఎల్లా ఉంటుందో ఆలోచించండి. విషమించకుండా ఏలా ఉంటుంది?

భారతదేశంలో అడుగు పెట్టిన మూడవనాడు సర్ జాన్ సైమన్ (దరిమిలా లార్డ్ అయ్యాడు) వైస్రాయ్ ఇర్విన్ పేర వ్రాసిన ఒక లేఖ ఆధారంగా, ఇర్విన్ ప్రభువు ఈ సూచన చేశాడు. ఆ ఉత్తరంలో సైమన్‌గారు ఏమని వ్రాశారంటే, సెంట్రల్ అసెంబ్లీ లోనూ, కౌన్సిల్‌ లోనూ ఉండే సభ్యులనుంచి, ఏడ్గురు సభ్యులు ఒక ఉప సంఘంగా ఏర్పడవచ్చుననీ, తమ సంఖ్య ఆరు నొక్కటవడాన్ని వారూ ఏడ్గురు ఉండడం న్యాయమనీ, వారు తమతో సమానస్థాయిలోనే పర్యటిస్తూ సాక్ష్యసేకరణ చెయ్యవచ్చుననీ, రాష్ట్రాలలో ఉండే శాసన సభ్యులు కూడా అదే ప్రకారం ఉప సంఘాలను ఏర్పరచుకుని రాయల్ కమిషన్ వారికి సహకారులుగా ఉండ వచ్చుననీ.