పుట:Naajeevitayatrat021599mbp.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదైనా ఇవ్వడానికి పూనుకునే రోజును ఎంత ఎక్కువ వెనక్కి నెట్ట కలిగితే అంత మంచిదని వారి ఆలోచన.

"చావు తెలివి" సమాచారం

ఈ మాదిరి కమిషన్ని ఏర్పాటు చేద్దాం అన్న ఊహ, "చావు తెలివి"లా, హఠాత్తుగా పుట్టిన కారణంచేత మన దేశానికి న్యాయంగా ఇవ్వవలసిన గడువు ఇవ్వకుండానే ఆ కమిషన్ని మన నెత్తిని రుద్దారు. భారతీయులు తమని ఏ విధంగా అర్థం చేసుకుని ఎటువంటి విమర్శలకు గురిచేస్తారో అని కూడా యోచించినట్లు లేదు. దేశంలో కలిగిన ఉద్రిక్త పరిస్థితులను శాంతపరచాలనే ఉద్దేశంతో ఏర్పరచే ఏ రాయల్ కమిషన్నయినా, ఆ కమిషన్ ఆశయమూ, దానికిచ్చే అవకాశమూ అది అవలంభించబోయే పద్దతి మొదలైనవేగానీ, ఆ కమిషన్‌లో పలానా పలానా వారుంటారన్న విషయం కూడా ముందుగా తెలియ చెయ్యందే ఏర్పరచడం సాధారణంగా జరగదు. ఉభయ దేశాలలోనూ లభ్యమైన సాక్ష్యాలవలన ఈ కమిషన్ని ఏర్పరచిన యోధులు (Constitution Commission) పై విషయా లన్నింటిలోను తప్పటడుగులు వేస్తూనే దీనిని నియమించినట్లు కనబడుతుంది. వేసే కమిషన్లకు ప్రాతిపదికగా పాటించవలసిన ప్రధాన సూత్రంగా ఆ కమిషన్‌లో భారతీయులపేర్లు కూడా కొన్ని ఉండాలి అన్న దృష్టే వారికి లేకపోయింది. ఈ దేశీయుల నామాలు కొన్ని అ కమిషన్‌లో ఉండి ఉంటే, ద్వంద ప్రభుత్వపు టేర్పాట్లు ఏ విధంగా పరిణయమించాయో సరిగా అంచనా వేసుకోవడానికైనా వారికి వీలుండేది. ఈ చిన్న పొరపాటే దేశంలోని అన్ని వర్గాలవారు ఒక్క తాటిమీదకు వచ్చి, కమిషన్‌వారి రాకను బహిష్కరించాలనే నిర్ణయానికి రావడానికి సహాయం చేసింది.

ఇర్విన్ ప్రకటన

ఈ కమిషనుకు సంబంధించిన ఉద్దేశాలూ, ఆదేశాలూ, స్థాయీలాంటివి కాస్త విచారిద్దాం. ఇర్విన్ ప్రభువు విడుదల చేసిన ఒక ప్రకట