పుట:Naajeevitayatrat021599mbp.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్సర్ వేటివ్‌ల ఎత్తు

దేశంలో అప్పట్లో నడుస్తూన్న కన్సర్వేటివ్ [1] ప్రభుత్వం జనరంజకంగా లేకపోవడాన్ని ఎన్నికలలో లేబర్ పార్టీ వారిదే పై చెయ్యి అయి, వారే రాజ్యపాలనలోకి వచ్చి, ఆ వెంటనే హిందూ దేశానికి నేరుగా పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేస్తారేమోననే భీతి కన్సర్వేటివ్‌లకి కలిగింది. లోగడ ఉపన్యాసాలలో రామ్సేమేక్డ్‌నాల్డ్ లాంటి లేబర్‌పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను ఆ ప్రకారంగా వ్యక్తపరిచారు కూడాను. కన్సర్వేటివ్‌లకు భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేసి చేతులు దులుపుకుని కూచోవడం ఇష్టం లేదు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి కన్సర్వేటివ్ ప్రభుత్వంవారు ఈ కమిషనును ఏర్పరిచారు. ఈ కమిషనువారు తొందర తొందరగా తమ విచారణ ముగించి, చేసే సిఫార్సుల ప్రకారం ఇండియాకి పూర్తిగా డొమినియన్ స్టేటస్ ఇవ్వకుండా తంటాలు పడవచ్చు కదా అన్నదే వారి ఊహ. కన్సర్వేటివ్ గవర్నమెంట్ వారికి కూడా "భావి" మీద దృష్టి లేకపోలేదు. కాని ఇండియా లేకపోతే ఇంగ్లండే లేదనే నమ్మకంతో ఉన్నవారు వారు.

ఇండియాలో కూడా, వివిధ రాజకీయ సంఘాలవారు, రకరకాలుగా ఆశాభంగాలు పొంది, ఏదో ఒక రకంగా మనకు ఉపకరించే ఏ కొద్దపాటి సూచనలయినా ఇంగ్లీషువారి నుంచి పిండి రాబట్టుకోవాలనీ, వారేమి ఇచ్చినా మహభాగేననీ అనుకుంటూన్న స్థితిలో ఉన్నారు.

పూర్వ రంగం

గత పది సంవత్సరాలలోనూ రాజకీయ సమరంలో సంక్షోభాన్ని కలుగజేసే ఎన్నో నూతన విషయాలూ, పోకడలూ తలయెత్తాయి. వెనక 1917 లో రాష్ట్రాలలో ద్వంద ప్రభుత్వపు టేర్పాట్లంటూ బ్రటిషు

  1. కన్సర్వేటివ్ లంటే మార్పులు ఇష్టం లేనివారనీ, లేబర్ పార్టీ అంటే శ్రామిక సంఘీయులు కనుక సానుభూతి కలిగి ఉంటారనీ లోకంలో అభిప్రాయం.