పుట:Naajeevitayatrat021599mbp.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన ఉపకారమైనా చేయలేకపోయారు. భార్య, బిడ్డలూ కూడా ఆయనకు దూరమయ్యారు. ఆయన ఎన్ని తంటాలు పడినా, ఎంత ఒత్తిడిని తీసుకురాగలిగినా, చివరకు వారి అంతస్తుకు, హుందాతనానికి తగిన "శిక్షణ" కోసం వారిని ప్రభుత్వంవారు ఇంగ్లాండు పంపించేశారు. మహారాజావారు కొడైకానలు దాటి బయటికి రాకూడదన్న ఆంక్ష జారీచేశారు.

18

మదరాసులో ఏర్పడిన "బినామీ" మంత్రివర్గం

1927 వ సంవత్సరారంభంలో 1926 నవంబరులో జరిగిన ఎన్నికలలో నెగ్గిన శాసన సభా సభ్యుల ప్రథమ సమావేశం జరిగింది. సభ్యులా సంవత్సరం ప్రజాహితార్థం కౌన్సిల్లో ప్రవేశ పెట్టదలచిన ముఖ్య విషయాలను గురించి చర్చించి-

1. కాంగ్రెసు వివిధ కక్షుల క్రింద ఏర్పడి, కేంద్ర, రాష్ట్రీయ శాసన సభా సమావేశాలకు హాజరయి తీరాలనీ;

2. మద్రాసులో కాంగ్రెసు పార్టీ పెద్దగా డాక్టర్ సి. సుబ్బరాయన్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించి, ఒక "బినామి" మంత్రివర్గం ఏర్పడాలనీ;

3. పార్లమెంట్ మెంబర్‌గా షౌకతాలీగారి రాక సందర్భంలో వారి ప్రాత:కాల ఫలహారం, శాసన సభా భవనంలోనే ఏర్పాటు చేయాలనీ;

4. శాసన సభ్యుడైన ఎస్. పి. మిశ్రాగారిని అరెస్టుచేసిన సందర్భంలో, మిశ్రాగారిని వెంటనే సభా మందిరంలో హాజరు పరచాలని మోతిలాల్‌గారు శాసన సభలో ప్రతిపాదించారనీ, దానిపైన తీవ్రమైన వాగ్వివాదం దుమారం లేచిందనీ, అంత హడావిడికి కారణం మోతిలాల్ గారు ప్రవేశపెట్టిన ప్రతిపాదన చరిత్రాత్మకమయినదనీ, అది