పుట:Naajeevitayatrat021599mbp.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కదా? నాయకులలో ధీమా లేదు. అనుచరులలో శక్తిలేదు. వీలయితే ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలదే గదా ప్రతివారి తాపత్రయం? కాంగ్రెసు ఉద్యోగస్వీకారం చేయరాదనీ, బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరించాలనీ, దేశానికి నిరుపయోగమని భావించిన విషయాలలో సహకరించ కూడదనీ ఆదేశిస్తే, శాసన సభా ప్రవేశం చేసిన కాంగ్రెసువారు సర్వసాధారణంగా క్లిష్టపరిస్థితులలో నిర్వీర్యుల్లా బలహీనతనే వ్యక్తపరచి ఉన్నారు కదా? 1927, 28. 29 సంవత్సరాలలో శాసన సభలో జరిగిన అనేక సంఘటనలు, పై విషయాలను రుజువు చేస్తున్నాయి కదా?

ఇటువంటి పరిస్థితులకు కారణం వారిని ఆదేశించిన విధానమే కదా? వారు ఆయా సంవత్సరాలలో ఏమీ సాధించలేని స్థితిలో ఉంటే, వారిని నిందించడానికి వీలులేని విధంగా, కేంధ్ర శాసన సభలలో బాధ్యత అన్నది లేకుండా వ్యవహరించడమూ, రాష్ట్ర శాసన సభలలో ప్రభుత్వాన్ని ఎదిరించమని ఆదేశించడమే కదా కారణం? మంత్రులు ప్రజాభిప్రాయానికి భిన్నంగానూ, నిష్పూచీగానూ వ్యవహరించడమూ జరిగింది కదా? పండిత మోతిలాల్ నెహ్రూగారూ, వారి పార్టీ వారూ కలిసి, వారికి ఒప్పగించబడిన ప్రతి స్వల్పవిషయంలోనూ ప్రజా హృదయానికీ, అభిప్రాయానికీ బాధ్యత వహించి వ్యవహరింపవలసిన పరిస్థితులలో, శాసన సభలో వాగ్వివాదాలతో విలువైన కాలాన్ని పైకారణాలవల్ల వృథా చేయడం అవివేకమే కదా?

నిజానికి 1927-1930 సంవత్సరాల మధ్య ఈ శాసన సభలలో ఉన్న మన కాంగ్రెసు సభ్యులు ధీశాలురూ, శక్తిమంతులూ, రాజ్య తంత్రజ్ఞలూ, పార్లమెంటరీ పద్ధతిని పరిపాలన సాగించగల నేర్పరులూ, అధికారం హస్తగతం అయితే తమ శక్తి సామర్థ్యాలను నిరూపించగల యోధులు అని పేరుగాంచారు. రిజర్వు బ్యాంకి బిల్లును గురించీ, కరెన్సీని గురించీ, మారకపు విలువలను గురించీ కేంద్ర శాసన సభలో జరిగిన చర్చలు గమనార్హమయి, మనవారి శక్తిసామ