పుట:Naajeevitayatrat021599mbp.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంబమూర్తి స్వాతంత్ర్య తీర్మానం

కాన్పూర్ కాంగ్రెసులో 1925 వ సంవత్సరంలో తీర్మానించబడిన కౌన్సిల్ పోగ్రాం తిరిగి గౌహతీలో చర్చించబడి, ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం, ఎన్నికలలో నెగ్గి శాసన సభలలో సభ్యత్వం సంపాదించినా, హోదాలేవి చేపట్టకుండా వర్తిస్తూ, కాంగ్రెసు వారి కోర్కెలు సఫలం చెయ్యబడేవరకూ ప్రభుత్వంవారి కార్యక్రమానికి అడ్డు తగులుచూండడమే అనుసరించవలసిన విధానం. అంతేకాదు, బడ్జట్ ప్యాసుకాకుండా చూడాలనీ, మంత్రులు జీతాలు జీతాలుపుచ్చుకోకుండా ఉండాలనీ దేశవ్యాప్తంగా గ్రామ పునరుద్ధరణ జరగాలనీ కొన్ని తీర్మానాలు చేయబడ్డాయి.

ఈ దరిమిలాను మద్రాసు శాసన సభా స్పీకరు పదవి నధిష్టించిన బులుసు సాంబమూర్తిగారు, ఆనాడు దేశానికి స్వేఛ్చాస్వాతంత్ర్యాల విషయంలో ప్రప్రథమంగా అలజడి తీసుకువచ్చారు. ఆయన 1926 కు పూర్వమే, ఆంద్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ సమావేశాలలో ఈ స్వేచ్చాస్వాతంత్ర్యాలను గురించిన ఉద్భోధ ఆరంభించారు. ఈ ప్రసక్తి ఎత్తుకుంటూ కాకినాడలో జరిగిన 1921 నాటి తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెసు సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. అప్పుడు ఆయన్ని నేను అడ్డుకున్నాను. కాని ఆయన ఈ అంశాన్ని అఖిల భారత కాంగ్రెసు కమిటీ వారి ముందు ఉంచారు. గౌహతీలో ఈ విషయం మీద గాంధీగారికీ, సాంబమూర్తిగారికి తీవ్రమయిన వాదోపవాదాలు జరిగాయి. గాంధీగారు ఈయన్నీ లొంగతీసుకోవాలని ప్రయత్నించారు గాని, ఈయన లొంగలేదు. దేశాన్ని త్యాగాలమీదా త్యాగాలు చెయ్యడానికి సంసిద్ధం చేయాలన్నదే ఆయన వాంఛ. నిజానికి సాంబమూర్తి మూర్తిభవించిన త్యాగం. గాంధీగారు ఈయన్నీ ఎగతాళిచేస్తూ, ఈ బ్రహ్మపుత్రానదిలో మనమంతా కట్ట కట్టుకుని దిగినా దేశానికి స్వేచ్చాస్వాతంత్ర్యాలు లభింపవన్నారు. దాన్తో సాంబమూర్తిగారు స్వాతంత్ర్య తిర్మానం త్రోసివేయబడింది. గాంధీగారికి దేశ స్వాతంత్ర్యం విషయంలో