పుట:Naajeevitayatrat021599mbp.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రక్షణకోసం బలవంతంగా మతాలు మారవలసివచ్చిన హిందువులు తిరిగి తమ మతంలో, సంఘంలో, పూర్వకులంలో ప్రవేశించడానికి సావకాశం కల్పించాలన్నాడు. మాలవ్యాలాంటి సదాచార సంపన్నుడూ, సనాతనుడూ కూడా హఠాత్తుగా హిందూమతంలోకి పున:ప్రవేశానికి అవకాశం కల్పించాలని అన్నాడంటే, ఆ నాటి అమానుష పరిస్థితులకి ఆయన ఎంతగా పరితపించాడో అర్థం అవుతుంది. అంతే కాదు. ఆయన నిగూడంగా అహింసా సిద్దాంతాల మతలబును విస్తరించి విశదపరచాడంటే, అందులో ఆ సిద్ధాంతాలను ప్రబోధించిన గాంధీగారు జైలులో ఉన్న రోజులలో తాను వాటిని పరిస్థితుల కనుగుణంగా వ్యాఖ్యానించబూని, అహింస అంటే హింసను సహించడం మాత్రమేకాదనీ, ఎదుర్కోవడంవల్ల సిద్దాంతభంగం కాదనీ హితవు చెప్పాడంటే, ఆ నాటి కల్లోలాలు ఆయన పవిత్ర హృదయాన్ని ఎంత కల్లోలపరచాయో అర్థం అవుతుంది. ఆనాడు మాలవ్యా మహాశయుడు ఇచ్చిన సలహా యావత్తు భారతదేశంలోని హిందువులకూ ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది.

నిజానికి "శుద్ధి", "సంగతం" అన్నవి మాత్రమే ఉంటే సంఘ సుఖజీవనానికి చాలదు. తిండీ, గుడ్డా అన్నవి కూడా, మతంతో నిమిత్తం లేకుండా, హిందూ మహమ్మదీయాదుల కందరికీ సమంగా కావలసిన అత్యవసర వస్తుసముదాయమే కదా! వీటిని లభింపజేయడానికి నిర్మాణాత్మక కృషి, ప్రచారమూ అత్యవసరం. సహనం, పరస్పర సహకారం మొదలైన వాటితో కూడిన నిర్మాణాత్మక కృషి జరగక పోవడంచేత సంఘజీవనం కుంటుపడిందన్నది సత్యదూరం కాదు. అసలు ముల్తాన్ కలతలు ప్రజల సుఖజీవనాన్నీ మనోభావాలనీ చికాకుపరచి వారిని నికృష్టజీవనానికి దిగజార్చిన స్థితి గమనార్హమే కదా!

మేకవన్నె పులులు

మతసామరస్యానికి కావలసిన సత్వర చర్యలను విస్మరించి మాలవ్యా మహాశయుడు "శుద్ది" "సంగతం" అంటూ వాపోతూఉంటే, వీలు చిక్కినప్పుడల్లా దెబ్బతీయాలనీ, కల్లోలాలు లేవదీసి హింసా